గులాబీ రంగులోకి ‘లోనార్ సరస్సు’!
ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రవేత్తలను ఆకర్షిస్తోన్న ప్రాచీన లోనార్ సరస్సు రంగు ఒక్కసారిగా మారిపోయింది. సాధారణంగా పచ్చని రంగులో ఉండే ..
ఆశ్చర్యానికి గురిచేస్తున్న 50వేల ఏళ్ల పురాతన సరస్సు
జీవ వైవిధ్యమే కారణమంటోన్న నిపుణులు!
ఔరంగాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రవేత్తలను ఆకర్షిస్తోన్న ప్రాచీన లోనార్ సరస్సు రంగు ఒక్కసారిగా మారిపోయింది. సాధారణంగా పచ్చని రంగులో ఉండే ఈ సరస్సు తాజాగా గులాబీ రంగులోకి మారడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే సరస్సులోని లవణీయత, ఆల్గే కారణం వల్లే ఇది గులాబీ రంగులోకి మారినట్లు నిపుణులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
మహారాష్ట్రలో బుల్దానా జిల్లాలో ఉన్న ఈ సరస్సు దాదాపు 1.2 కి.మీ వ్యాసార్థంతో ఉంటుంది. ముంబయి నుంచి దాదాపు 500కి.మీ దూరంలో ఉన్న ఈ సరస్సు, దాదాపు 50వేల సంవత్సరాల క్రితం ఉల్కాపాతం వల్ల ఈ బిలం ఏర్పడిందిగా ఇప్పటికే గుర్తించారు. దీనికున్న ప్రాచీన నేపథ్యం దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఇక్కడకు వస్తుంటారు. అయితే, ఈ సరస్సు తాజాగా రాత్రికి రాత్రే రంగు మారి కనిపించడం అటు శాస్త్రవేత్తలతోపాటు ప్రకృతి ఔత్సాహికులను ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
లోనార్ బిలానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఇప్పటికే దీన్ని జాతీయ భౌగోళిక వారసత్వంగా గుర్తించినట్లు ఈ సరస్సు సంరక్షణాభివృద్ధి సభ్యులు గజానన్ ఖారత్ వెల్లడించారు. అయితే, లోనార్ సరస్సు ఇలా రంగుమారడం ఇదే తొలిసారి కాదని గుర్తుచేశారు. అయితే ఈసారి మాత్రం మరింత తేజంగా గులాబీ రంగులో మెరుస్తుండటం మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తోందని గజానన్ ఖారత్ పేర్కొన్నారు. ఇలాగే, ఇరాన్లో ఓ సరస్సులో కూడా లవణీయత పెరుగుదల కారణంగా సరస్సు ఎరుపు రంగులో మారిన విషయాన్ని ఖారత్ గుర్తుచేశారు.
‘గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుతం సరస్సులో నీరు తగ్గిపోయింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో సరైన వర్షం లేనికారణంగా కొత్త నీరు కూడా చేరలేదు. ఇలా కనిష్ట నీటి స్థాయి ఉండటం కూడా లవణీయత పెరగడంతోపాటు ఆల్గేలో మార్పుకు కారణం. ఇదే సరస్సు రంగు మారడానికి కారణమై ఉండవచ్చు’ అని సరస్సు సంరక్షణాభివృద్ధి సభ్యులు ఖారత్ అభిప్రాయపడ్డారు.
లోనార్ సరస్సు రంగు మారడంలో మానవ ప్రమేయం లేదని సరస్సును పరిశీలించిన భూగోళశాస్త్ర నిపుణులు డాక్టర్ మదన్ సూర్యవంశి కూడా స్పష్టం చేశారు. అయితే, సాధారణంగా నీటిలో ఉండే శిలీంద్రాల వల్ల నీరు ఆకుపచ్చ రంగులోకి మాత్రమే మారుతుందని అన్నారు. ఇలా గులాబీ రంగులోకి మారడం లోనార్ బిలంలోని జీవవైవిధ్యం వల్లే జరగవచ్చని మదన్ సూర్యవంశి అభిప్రాయపడ్డారు. తాజాగా సరస్సు రంగు మారడంపై అధికారులు, శాస్త్రవేత్తలు మరింత పరిశోధనకు సన్నద్ధమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం’ - రాహుల్ సంచలన ఆరోపణ
హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) దాదాపు 400 మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని రాహుల్ గాంధీ ఆరోపించారు. -
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
Prajwal Revanna: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు బృందం లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. -
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్‌లో 223 మంది తొలగింపు
Delhi Commission for Women: దిల్లీ మహిళా కమిషన్‌లో 223 మంది ఉద్యోగులపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వేటు వేశారు. వారిని తక్షణమే విధుల్లో నుంచి తొలగించారు. -
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
మండుటెండల్లో వాహనదారులకు కాస్త ఉపశమనం కల్పించింది పుదుచ్చేరి ప్రభుత్వం. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ షేడ్ నెట్స్‌ను ఏర్పాటు చేసింది. -
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్‌కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్‌సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్‌పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి