కరోనా: ఆ మందుకు మినహాయింపు

ఇప్పటి వరకు కరోనా రోగులకు అందించే చికిత్సలో ఉపయోగిస్తున్న అజిత్రోమైసిన్‌ ట్యాబ్లెట్‌ వినియోగాన్ని ఆపేయాలని వైద్యారోగ్య శాఖ భావిస్తున్నట్లు సమాచారం.....

Published : 13 Jun 2020 02:17 IST

దిల్లీ: ఇప్పటి వరకు కరోనా రోగులకు అందించే చికిత్సలో ఉపయోగిస్తున్న అజిత్రోమైసిన్‌ ట్యాబ్లెట్‌ వినియోగాన్ని ఆపేయాలని వైద్యారోగ్య శాఖ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య కుంటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ త్వరలో మార్గదర్శకాల్లో మార్పులు చేయనుందని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. చాలా రోజుల నుంచి హైడ్రాక్సి క్లోరోక్విన్‌తో పాటు అజిత్రోమైసిన్‌ ట్యాబ్లెట్‌ను ఐసీయూలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు అందిస్తున్నారు.

అయితే ఈ మందు రోగుల్లో ఆశించిన ఫలితాలను ఇవ్వడంలేదని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో కరోనా చికిత్స నుంచి దీనిని ఉపసంహరించాలని కేంద్రం భావిస్తోంది. ఇక మీదట కరోనా సోకిన ప్రాథమిక రోగులకు, ఐసీయూలో చికిత్స పొందుతున్న వారికి హైడ్రాక్సిక్లోరోక్విన్‌ మాత్రమే అందివ్వనున్నట్లు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని