ఆరేళ్ల బాలుణ్ని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాది హతం

గత వారం ఓ ఆరేళ్ల బాలుణ్ని పొట్టనబెట్టుకున్న కరడు గట్టిన ఉగ్రవాదిని భద్రతా బలగాలు ఎట్టకేలకు గురువారం రాత్రి మట్టుబెట్టాయి. అనంత్‌నాగ్‌ జిల్లా బిజ్‌బెహరా ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ బృందంపై ఉగ్రవాదులు.....

Published : 04 Jul 2020 01:46 IST

శ్రీనగర్‌: గత వారం ఓ ఆరేళ్ల బాలుణ్ని పొట్టనబెట్టుకున్న కరడు గట్టిన ఉగ్రవాదిని భద్రతా బలగాలు ఎట్టకేలకు గురువారం రాత్రి మట్టుబెట్టాయి. అనంత్‌నాగ్‌ జిల్లా బిజ్‌బెహరా ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ బృందంపై ఉగ్రవాదులు గతవారం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ జవాన్‌ సహా ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. అనంతరం బలగాలు జరిపిన కాల్పుల నుంచి తప్పించుకున్న ముష్కరుడు శ్రీనగర్‌లోకి ప్రవేశించాడు.

ఈ క్రమంలో గురువారం రాత్రి ఆ ఉగ్రవాది శ్రీనగర్‌లోని బల్‌బాగ్ ప్రాంతంలో నక్కి ఉన్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలతో కలిసి నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో దళాల కదలికల్ని పసిగట్టిన ముష్కరుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో బలగాలు ఎదురుకాల్పులు జరపగా.. ఉగ్రవాది అక్కడికక్కడే హతమయ్యాడు. అతడు జమ్మూకశ్మీర్‌ ఇస్లామిక్‌ స్టేట్‌కు చెందిన జహీద్‌ దాస్‌గా గుర్తించారు. ఈ ఘటనలో ఓ సీర్పీఎఫ్‌ జవాన్‌ కూడా అమరుడవడం విచారకరం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని