Facebook: భారత్‌ ఎన్నికల్లో ‘ఫేస్‌బుక్‌’ జోక్యం: కాంగ్రెస్‌ విమర్శలు

సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్‌పై కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. భారత్‌లో ఎన్నికలను ఆ సంస్థ ప్రభావితం చేస్తూ.

Updated : 26 Oct 2021 10:50 IST

దీనిపై జేపీసీతో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌

​​​​​​

దిల్లీ: సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్‌పై కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. భారత్‌లో ఎన్నికలను ఆ సంస్థ ప్రభావితం చేస్తూ..ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందంటూ విరుచుకుపడింది. దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేసింది. భారతీయ జనతా పార్టీ(భాజపా) చేతిలో ఫేస్‌బుక్‌ ఒక సాధనంగా మారిపోయిందని ఆరోపించింది. విద్వేష ప్రచారం, ప్రసంగాల విషయంలో ఆ సంస్థ అనుసరిస్తున్న తీరును కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా  తప్పుపట్టారు. ముఖ్యంగా హిందీ, బెంగాలీ భాషల్లో విద్వేష పోస్టులపై చర్యలు తీసుకొనే సిబ్బందిని కూడా ఫేస్‌బుక్‌ నియమించలేదని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఆ సంస్థలో పనిచేస్తున్న ఫ్రాన్సెస్‌ హాగెన్‌ అనే ఉద్యోగి బయటపెట్టారని తెలిపారు. లక్షలాది నకిలీ ఖాతాలు ఉన్నాయన్న విషయం అంతర్గత నివేదికల్లో వెల్లడైనా, ఇప్పటివరకు వాటిపై ఫేస్‌బుక్‌ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఖేరా ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా, దాని అనుబంధ సంస్థలకు చెందిన వ్యక్తులు ఫేస్‌బుక్‌లోకి చొరబడ్డారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని