Nagaland: కత్తులతో దాడి చేసి.. సైనికుడి గొంతు కోసి.. 

నాగాలాండ్‌లోని మోన్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన కాల్పుల ఘటనలకు సంబంధించి తాజాగా

Published : 07 Dec 2021 11:39 IST

దిల్లీ: నాగాలాండ్‌లోని మోన్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన కాల్పుల ఘటనలకు సంబంధించి తాజాగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి! తిరు, ఓటింగ్‌ గ్రామాల మధ్య శనివారం రోడ్డుపై వెళ్తున్న వాహనంలో ఓ పరికరాన్ని చూసి.. వేటకు ఉపయోగించే రైఫిల్‌గా సైనికులు పొరబడటమే మొత్తం దారుణ పరిణామాలకు మూల కారణమని తెలుస్తోంది. రైఫిల్‌ ఉన్నట్లు కనిపించగానే వారు కాల్పులు జరిపినట్లు సైనిక వర్గాలు తాజాగా వెల్లడించాయి. అనంతరం అక్కడికి చేరుకున్న గ్రామస్థులు కోపోద్రిక్తులై బలగాలపై తల్వార్‌ల వంటి పెద్ద కత్తులతో దాడి చేసినట్లు తెలిపాయి. ఓ సైనికుడిని వారు గొంతు కోసి చంపారని పేర్కొన్నాయి. మొత్తం 13 మంది సైనికులకు కత్తి గాయాలయ్యాయని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని