పెద్దింటి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే ఆ మహిళకు శాపమైంది!

పెద్దింటి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే ఆ మహిళకు శాపంగా మారింది. ప్రభుత్వ నల్లా వద్ద నీటిని పట్టుకోవద్దు,

Updated : 19 Dec 2021 11:09 IST

మధ్యప్రదేశ్‌లో ఓ మహిళపై ఆంక్షలు 

భోపాల్‌: పెద్దింటి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే ఆ మహిళకు శాపంగా మారింది. ప్రభుత్వ నల్లా వద్ద నీటిని పట్టుకోవద్దు, గుడిలోకి రావద్దు అంటూ గ్రామంలోని పెద్దలు ఆంక్షలు విధించారు. మధ్యప్రదేశ్‌లోని హర్దా నగరంలో ఈ అమానుషం వెలుగు చూసింది. స్థానిక కొత్త బస్టాండ్‌ సమీపంలో నివసించే ఓ దళిత మహిళ ఓ పెద్దింటి వ్యక్తిని ప్రేమించి.. నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. అగ్రవర్ణాలకు చెందిన పెద్దలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాహం జరిగినప్పటి నుంచి ఆ ప్రాంతంలోని వారు వేధించడం ప్రారంభించారని బాధిత మహిళ చెప్పారు. కులం పేరుతో దూషిస్తూ మానసికంగా బాధపెడుతున్నారని పేర్కొన్నారు. ఇంటి సమీపంలోని ప్రభుత్వ నల్లా వద్ద నీటిని పట్టుకునేందుకు సైతం అనుమతించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళితే మరుగుదొడ్డిపై రాళ్లు వేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. సమీపంలోని ఆలయంలోకీ తనను రానివ్వడం లేదని చెప్పారు. ఆలయంలోని పూజారి సైతం తన కుమార్తెను పలుమార్లు కొట్టి.. గుడిలో నుంచి తోసివేశారని తెలిపారు. ఒకసారి పూజారి కొట్టడం వల్ల తన కుమార్తె పెదవి పగిలిపోయిందని, గుడి బయటే ఉండి ప్రసాదం తీసుకోవాలని చెప్పేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరుగుతున్న అన్యాయంపై ఒకసారి అజాక్‌ ఠాణాలో, మరోసారి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వల్ల మరోమారు గత గురువారం ఎస్పీ కార్యాలయానికి వెళ్లినట్లు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని