ఉరీ సెక్టార్‌లో భారీగా ఆయుధాలు స్వాధీనం

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకొన్నట్లు ఆర్మీ అధికారి మేజర్‌ జనరల్‌ అజయ్‌ చంద్రపురియ మీడియాకు తెలిపారు.

Published : 26 Dec 2022 04:56 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకొన్నట్లు ఆర్మీ అధికారి మేజర్‌ జనరల్‌ అజయ్‌ చంద్రపురియ మీడియాకు తెలిపారు. ఎనిమిది ఏకే-74 రైఫిళ్లు, 12 చైనీస్‌ పిస్తోళ్లు, భారీ మందుగుండు సామగ్రి, పాకిస్థాన్‌.. చైనాలలో తయారైన చేతి గ్రనేడ్లు, ‘ఐ లవ్‌ పాకిస్థాన్‌’ అని రాసిన 81 బెలూన్లు అందులో ఉన్నట్లు వివరించారు. లోయలో ఇటు ఉగ్రవాదులు, అటు ఆయుధాలు బాగా తగ్గిన తరుణంలో చొరబాట్లు పెంచేందుకు పాకిస్థాన్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ రికవరీలు జరిగినట్లు వెల్లడించారు. ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల నుంచి అందిన సమాచారం మేరకు ఎల్‌వోసీ వద్ద తమ దళాలు  విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు