మీ సౌందర్య రహస్యం చెప్పండి సర్‌.. యువతి ప్రశ్న.. థరూర్‌ ఆసక్తికర జవాబు

కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ను చాలా అందంగా ఉంటారని కొనియాడిన ఓ మహిళా అభిమాని.. దాని వెనుక ఉన్న రహస్యమేంటో చెప్పాలని ఆయన్ను అడిగింది.

Updated : 07 Mar 2023 05:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ను చాలా అందంగా ఉంటారని కొనియాడిన ఓ మహిళా అభిమాని.. దాని వెనుక ఉన్న రహస్యమేంటో చెప్పాలని ఆయన్ను అడిగింది. థరూర్‌ ఇటీవల నాగాలాండ్‌లో పర్యటించారు. అక్కడ జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ యువతి థరూర్‌ను ఓ ప్రశ్న అడిగింది. ‘‘సర్‌.. నేను మీకు పెద్ద అభిమానిని. మీరు చాలా అందంగా, ఆకర్షణీయంగా కన్పిస్తూ అదే సమయంలో చాలా తెలివైన వ్యక్తిగా ఎలా ఉండగలుగుతారు? మీ రహస్యమేంటో చెప్పండి’’ అని ఆ యువతి ప్రశ్నించింది. దీనికి థరూర్‌ స్పందిస్తూ.. ‘‘అందం గురించి నిజాయతీగా ఒక మాట చెప్పాలంటే.. మీ తల్లిదండ్రులను మీరు తెలివిగా ఎంచుకోండి. వారసత్వంలోనే అంతా ఉంటుంది’’ అంటూ సరదాగా బదులిచ్చారు. ‘‘తెలివికి మన శ్రమ కూడా అవసరం. చదవడం అలవాటుగా మారాలి. నేను చిన్నప్పటి నుంచి చాలా పుస్తకాలు చదివాను. అందులోని ఎన్నో విషయాలను గుర్తుంచుకున్నాను. సాధన చేస్తే ఏదీ అసాధ్యం కాదు. బయట ప్రేక్షకుల మధ్యకు వెళ్లి వాళ్ల స్పందన గుర్తించాలి. అప్పుడే మనల్ని మెరుగుపర్చుకోగలం’’ అంటూ థరూర్‌ సలహా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని