చైనా ఫోన్లు వాడొద్దు.. భారత సైన్యానికి నిఘా వర్గాల హెచ్చరిక

భారత సైనిక సిబ్బంది చైనా మొబైల్‌ ఫోన్లను వాడకుండా చర్యలు తీసుకోవాలంటూ రక్షణశాఖ అధికారులకు సూచించాయి.

Updated : 08 Mar 2023 06:00 IST

దిల్లీ: భారత సైనిక సిబ్బంది చైనా మొబైల్‌ ఫోన్లను వాడకుండా చర్యలు తీసుకోవాలంటూ రక్షణశాఖ అధికారులకు సూచించాయి. మాల్‌వేర్‌, స్పైవేర్‌ల ముప్పు పొంచివున్న నేపథ్యంలోనే ఈ హెచ్చరిక చేసినట్లు సమాచారం. చైనా మొబైల్‌ ఫోన్లపై అప్రమత్తంగా ఉండాలని సైనిక సిబ్బందికి తెలియజేయాలంటూ రక్షణశాఖ నిఘా వర్గాలు ఓ సర్క్యూలర్‌ జారీ చేశాయి. భారత ప్రత్యర్థి దేశాల్లో తయారుచేసిన మొబైల్‌ ఫోన్లను సైనిక సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు వాడకుండా చూడాలని అందులో పేర్కొన్నాయి. ఇటీవల కొన్ని చైనా ఫోన్లలో మాల్‌వేర్‌, స్పైవేర్‌లు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో నిఘా వర్గాలు ఈ హెచ్చరికలు జారీ చేశాయి. చైనాకు చెందిన యాప్‌లపైనా నిఘా వర్గాలు గతంలో చర్యలు తీసుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని