76 నమూనాల్లో ఎక్స్‌బీబీ 1.16 వేరియంట్‌

దేశవ్యాప్తంగా సేకరించిన 76 నమూనాల్లో కొవిడ్‌ ఎక్స్‌బీబీ 1.16 వేరియంట్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇన్సాకాగ్‌ డేటా ప్రకారం కర్ణాటకలో 30, మహారాష్ట్రలో 29, పుదుచ్చేరిలో 7, దిల్లీలో 5, తెలంగాణలో 2 కేసులతో పాటు గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఒడిశాలలో సేకరించిన ఒక్కో నమూనాలో ఈ వేరియంట్‌ బయటపడింది.

Updated : 19 Mar 2023 06:07 IST

దేశంలో పెరుగుతున్న కొవిడ్‌ కేసులకు ఇదే కారణం!

దిల్లీ: దేశవ్యాప్తంగా సేకరించిన 76 నమూనాల్లో కొవిడ్‌ ఎక్స్‌బీబీ 1.16 వేరియంట్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇన్సాకాగ్‌ డేటా ప్రకారం కర్ణాటకలో 30, మహారాష్ట్రలో 29, పుదుచ్చేరిలో 7, దిల్లీలో 5, తెలంగాణలో 2 కేసులతో పాటు గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఒడిశాలలో సేకరించిన ఒక్కో నమూనాలో ఈ వేరియంట్‌ బయటపడింది. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న కొవిడ్‌ కేసులకు ఎక్స్‌బీబీ 1.16 వేరియంటే కారణమని నిపుణులు భావిస్తున్నారు. దీని ఉనికిని ఇప్పటి వరకు 12 దేశాల్లో గుర్తించగా కేసుల పరంగా భారత్‌ తొలి స్థానంలో ఉందని ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ మాజీ కన్వీనర్‌ విపిన్‌ ఎమ్‌. వశిష్ట వెల్లడించారు. భారత్‌లో గత 14 రోజుల్లో కొవిడ్‌ కేసుల పెరుగుదల 281 శాతం, మరణాల సంఖ్య 17 శాతం పెరిగిందని ఆయన ట్వీట్‌ చేశారు. ఎక్స్‌బీబీ 1.16 వేరియంట్‌ వల్ల పెద్ద ప్రమాదం లేకపోయినప్పటికీ కొవిడ్‌ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని