నాలుగు కూనలకు జన్మనిచ్చిన నమీబియా చీతా

నమీబియా నుంచి గతేడాది భారత్‌కు తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి నాలుగు కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు.

Updated : 30 Mar 2023 08:10 IST

భోపాల్‌: నమీబియా నుంచి గతేడాది భారత్‌కు తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి నాలుగు కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ‘‘వన్యప్రాణుల సంరక్షణలో చరిత్రాత్మకమైన క్షణం. గతేడాది సెప్టెంబరు 17న నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి నాలుగు కూనలకు జన్మనిచ్చింది’’ అని వీడియో, ఫొటోను మంత్రి ట్విటర్‌లో షేర్‌ చేశారు. దీంతో దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత భారత్‌ గడ్డపై చీతాలు పుట్టినట్లయ్యింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని