Bihar: బిహార్‌ రైల్వేస్టేషన్ల టీవీల్లో ‘నీలి’గోల!

బిహార్‌ రాష్ట్రంలోని భాగల్‌పుర్‌ పట్టణ రైల్వేస్టేషనులోని టీవీ తెరపై సోమవారం రాత్రి 10.00 గంటల ప్రాంతంలో ఉన్నపళంగా ప్రత్యక్షమైన అసభ్య సందేశం చూసి ప్రయాణికులు అవాక్కయ్యారు.

Updated : 19 Apr 2023 09:57 IST

భాగల్‌పుర్‌: బిహార్‌ రాష్ట్రంలోని భాగల్‌పుర్‌ పట్టణ రైల్వేస్టేషనులోని టీవీ తెరపై సోమవారం రాత్రి 10.00 గంటల ప్రాంతంలో ఉన్నపళంగా ప్రత్యక్షమైన అసభ్య సందేశం చూసి ప్రయాణికులు అవాక్కయ్యారు. 5 నుంచి 10 నిమిషాలు ప్రసారమైన ఆ సమాచారాన్ని కొంతమంది తమ సెల్‌ఫోన్లతో చిత్రించగా, మరికొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ప్రసారాలను వెంటనే నిలిపివేశారు. గత మార్చి నెలలో బిహార్‌ రాజధాని పట్నా రైల్వేస్టేషనులోని టీవీ తెరలపై మూడు నిమిషాలపాటు ఏకంగా నీలిచిత్రమే ప్రసారమైంది. ఈ ఉదంతం మరవకముందే భాగల్‌పుర్‌లో మరో అపశ్రుతి దొర్లింది. వివరాలు సేకరించిన సబ్‌ డివిజనల్‌ అధికారి ధనంజయ్‌కుమార్‌, డీఎస్పీ అజయ్‌కుమార్‌ చౌధరి టీవీ ప్రసారాలపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొంటామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని