Indigo: పాక్‌ గగనతలంలోకి ఇండిగో విమానం

అమృత్‌సర్‌ నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరిన ఓ ఇండిగో విమానం ప్రతికూల వాతావరణం కారణంగా పాకిస్థాన్‌ గగనతలంలోకి ప్రవేశించింది.

Published : 12 Jun 2023 07:52 IST

ప్రతికూల వాతావరణంతో ఘటన
సురక్షితంగా తిరిగి దేశంలోకి ప్రవేశం

ఇస్లామాబాద్‌: అమృత్‌సర్‌ నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరిన ఓ ఇండిగో విమానం ప్రతికూల వాతావరణం కారణంగా పాకిస్థాన్‌ గగనతలంలోకి ప్రవేశించింది. లాహోర్‌ సమీపంలోని గుజ్రాన్‌వాలా వరకూ దూసుకెళ్లింది. 30 నిమిషాల తరువాత సురక్షితంగా మన గగనతలంలోకి వచ్చేసింది. ఈ మేరకు ఆదివారం విమానయాన సంస్థ వెల్లడించింది. విమాన రాడార్‌ వివరాల ప్రకారం.. భారత విమానం శనివారం రాత్రి 7.30 గంటలకు ఉత్తర లాహోర్‌ ప్రాంతంలోకి ప్రవేశించింది. రాత్రి 8 గంటలకు భారత్‌కు తిరిగివచ్చేసింది. ఈ వ్యవహారంపై అమృత్‌సర్‌ ఏటీసీ టెలిఫోన్‌ ద్వారా పాకిస్థాన్‌తో చక్కటి సమన్వయం సాగించింది. అదేవిధంగా విమాన సిబ్బంది ఆర్‌-టీ ద్వారా నిరంతరాయంగా పాకిస్థాన్‌ ఏటీసీ అధికారులతో సంభాషిస్తూనే ఉన్నారు. చివరికి విమానం శనివారం రాత్రి   8.01 నిమిషాలకు అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ(సీఏఏ)కు చెందిన ఓ సీనియర్‌ అధికారి దీనిపై మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా ప్రతికూల వాతావరణం సందర్భాల్లో ఇలాంటి ఘటనలు సాధారణంగా జరుగుతుంటాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని