రాజకీయాల్లోకి అభిషేక్‌ బచ్చన్‌?

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ త్వరలో రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. తండ్రి అమితాబ్‌ బచ్చన్‌ పోటీ చేసిన స్థానం నుంచే ఆయన బరిలో దిగనున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

Updated : 16 Jul 2023 05:35 IST

ప్రయాగ్‌రాజ్‌ నుంచే పోటీ!
గతంలో అమితాబ్‌ నెగ్గింది అక్కడే

దిల్లీ: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ త్వరలో రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. తండ్రి అమితాబ్‌ బచ్చన్‌ పోటీ చేసిన స్థానం నుంచే ఆయన బరిలో దిగనున్నట్లుగా ప్రచారం సాగుతోంది. సమాజ్‌వాదీ పార్టీ తరఫున యూపీలోని ప్రయాగ్‌రాజ్‌ లోక్‌సభ స్థానం నుంచి అభిషేక్‌ పోటీ చేయనున్నారనే ప్రచారంపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు. అమితాబ్‌ 1984లో అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ కోరిక మేరకు ప్రయాగ్‌రాజ్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి, భారీ మెజార్టీతో గెలుపొందారు. లోక్‌దళ్‌ అభ్యర్థి హెచ్‌.ఎన్‌.బహుగుణపై లక్ష పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. అభిషేక్‌ తల్లి జయా బచ్చన్‌ కూడా ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ తరఫున యూపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో అభిషేక్‌ను కూడా ప్రయాగ్‌రాజ్‌ నుంచి బరిలో దించాలని సమాజ్‌వాదీ అగ్రనేతలు భావిస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని