ఓటీపీ మోసాలకు సరికొత్త విరుగుడు

ఆధునిక కాలంలో ఓటీపీ మోసాలు, పాస్‌వర్డ్‌ హ్యాకింగ్‌ ఉదంతాలు ఎక్కువయ్యాయి. వీటి కట్టడికి హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ ఐఐటీ శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మక వ్యవస్థను అభివృద్ధి చేశారు.

Published : 27 Mar 2024 05:50 IST

ఐఐటీ మండీ శాస్త్రవేత్తల ఘనత

దిల్లీ: ఆధునిక కాలంలో ఓటీపీ మోసాలు, పాస్‌వర్డ్‌ హ్యాకింగ్‌ ఉదంతాలు ఎక్కువయ్యాయి. వీటి కట్టడికి హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ ఐఐటీ శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మక వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇది.. ఆయా వినియోగదారుల బయోమెట్రిక్‌ వ్యవహారశైలి పోకడల ఆధారంగా వారిని ధ్రువీకరించుకుంటుంది. ఈ వ్యవస్థకు ‘అడాప్‌ఐడీ’ అని పేరు పెట్టారు. దీనికి పేటెంట్‌ కూడా లభించింది. ఇప్పటికే ఈ వ్యవస్థను ఒక బ్యాంక్‌, ఫోరెన్సిక్‌ కంపెనీలో ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారుడి ధ్రువీకరణకు వాడేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వశాఖతో.. దీని రూపకర్తలు చర్చలు జరుపుతున్నారు. సంప్రదాయ ఆన్‌లైన్‌ ధ్రువీకరణ విధానాలు పాస్‌వర్డ్‌లు, ఓటీపీలపై ఆధారపడి ఉంటాయి. ఇలాంటివి పూర్తిస్థాయి రక్షణ కల్పించలేవు. సైబర్‌ మోసాలకు చాలావరకూ కారణం.. ఓటీపీలు నేరగాళ్ల చేతికి దొరకడమే. ఈ వ్యవస్థకు భిన్నంగా అడాప్‌ఐడీ.. వినియోగదారుడి వ్యవహారశైలి, శరీర సంబంధ బయోమెట్రిక్స్‌పై ఆధారపడుతుంది. ఎప్పటికప్పుడు మారిపోయే అలవాట్లకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడం దీని ప్రత్యేకత. దీనివల్ల బహుళ అంచెల రక్షణ లభిస్తుంది. పాస్‌వర్డ్‌లపై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని