పోరాటానికి సన్నద్ధంగా ఉండండి

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తన సైనిక బలగాలకు అప్రమత్తత సందేశాన్ని ఇచ్చారు. పోరాట నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకొని, అత్యున్నతస్థాయి అప్రమత్తతను కలిగి ఉండాలన్నారు. ఏ క్షణాన యుద్ధం వచ్చినా ఎదుర్కొనేందుకు

Published : 06 Jan 2021 04:30 IST

సైనిక దళాలకు చైనా అధ్యక్షుడి పిలుపు

బీజింగ్‌: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తన సైనిక బలగాలకు అప్రమత్తత సందేశాన్ని ఇచ్చారు. పోరాట నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకొని, అత్యున్నతస్థాయి అప్రమత్తతను కలిగి ఉండాలన్నారు. ఏ క్షణాన యుద్ధం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. సైనిక బలగాలపై తనకు విస్తృత అధికారాలను కల్పించే కొత్త రక్షణ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చైనా కమ్యూనిస్టు పార్టీతో పాటు కేంద్ర సైనిక కమిషన్‌ (సీఎంసీ)కు జిన్‌పింగ్‌ నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది కమిషన్‌కు సంబంధించిన తొలి ఉత్తర్వుపై ఆయన సంతకం చేసినట్లు అధికారిక మీడియా మంగళవారం పేర్కొంది. చైనా సైన్యం, సాయుధ పోలీసు దళాల శిక్షణకు సంబంధించిన ప్రాధాన్యతలను ఇందులో ప్రస్తావించారు. సోషలిజానికి సంబంధించి జిన్‌పింగ్‌ సిద్ధాంతానికి కట్టుబడాలని సైన్యానికి ఈ ఉత్తర్వు పిలుపునిచ్చింది. వాస్తవ యుద్ధరంగాన్ని పోలి ఉండే పరిస్థితుల్లో శిక్షణ పొందాలని సూచించింది. పోరాట వ్యూహాలపై మరింత పరిశోధన సాగించాలని తెలిపింది. యుద్ధవిన్యాసాలను పెంచాలంది. అధునాతన ఆయుధ సంపత్తిని వినియోగించే నైపుణ్యాన్ని కలిగి ఉండాలంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని