స్విస్‌లో 20,700 కోట్లకుపైగా భారతీయుల డబ్బు

నల్లధనానికి మారుపేరుగా వ్యవహరించే స్విస్‌ అకౌంట్లు మరోమారు తెరపైకి వచ్చాయి. కరోనా మహమ్మారితో విలవిల్లాడిన 2020 సంవత్సరంలో స్విట్జర్లాండ్‌ బ్యాంకుల్లో

Updated : 20 Jun 2021 07:15 IST

13 ఏళ్లలో ఇదే అత్యధికమంటున్న స్విట్జర్లాండ్‌ గణాంకాలు

విభేదించిన కేంద్ర ఆర్థిక శాఖ

దిల్లీ: నల్లధనానికి మారుపేరుగా వ్యవహరించే స్విస్‌ అకౌంట్లు మరోమారు తెరపైకి వచ్చాయి. కరోనా మహమ్మారితో విలవిల్లాడిన 2020 సంవత్సరంలో స్విట్జర్లాండ్‌ బ్యాంకుల్లో భారతీయుల నిధులు రూ.20వేల కోట్లకుపైగా పెరిగాయంటూ మీడియాలో ఇటీవల వార్తలు వెలువడ్డాయి. స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంకు విడుదల చేసిన గణాంకాలను ఉటంకించాయి. భారతీయుల వ్యక్తిగత లేదా కంపెనీల ద్వారా స్విస్‌ బ్యాంకుల్లో... రూ.20,700 కోట్లకుపైగా జమకావడం గత 13 ఏళ్లలోనే అత్యధికం! అయితే, బ్యాంకు వినియోగదారుల వ్యక్తిగత ఖాతాల్లో నిధులు తగ్గి... బాండ్లు, సెక్యూరిటీలు, ఇతర ఆర్థిక లావాదేవీల రూపాల్లో నిధులు పెరగటం గమనార్హం. అందుకే... స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంకు నుంచి నిధుల వివరాలు వెల్లడి కాగానే భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. స్విస్‌ ఖాతాల్లో భారీస్థాయిలో భారతీయుల డిపాజిట్లు పెరిగాయనటం సరికాదని పేర్కొంది. ‘‘2019తో పోలిస్తే స్విస్‌బ్యాంకుల్లో భారతీయ కస్టమర్ల డిపాజిట్లు తగ్గాయి. బినామీ నిధులు కూడా సగానికి క్షీణించాయి. అయితే... బాండ్లు, సెక్యూరిటీలు, ఇతర మార్గాల ద్వారా నిధులు భారీగా పెరిగినట్లున్నాయి. ఏదేమైనా... ఈ పెరుగుదలకు కారణాలేంటో స్విస్‌ అధికారుల నుంచి వివరాలు కోరుతున్నాం’’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని