logo

రాజకీయాలకు కేరాఫ్‌.. కేపీహెచ్‌బీ టెంపుల్‌ బస్టాపు

ఎన్నికలొచ్చాయంటే 45ఏళ్ల చరిత్ర గల కేపీహెచ్‌బీ టెంపుల్‌ బస్టాపు పేరు మార్మోగుతుంది. ఏ పార్టీ నాయకులైనా ఎన్నికల సమయంలో ఈ బస్టాపు కేంద్రంగానే రాజకీయాలు చేస్తుంటారు.

Updated : 08 May 2024 07:21 IST

1996-97 సమయంలో బస్టాపు చిత్రం

ఎన్నికలొచ్చాయంటే 45ఏళ్ల చరిత్ర గల కేపీహెచ్‌బీ టెంపుల్‌ బస్టాపు పేరు మార్మోగుతుంది. ఏ పార్టీ నాయకులైనా ఎన్నికల సమయంలో ఈ బస్టాపు కేంద్రంగానే రాజకీయాలు చేస్తుంటారు. గతంలో పీజేఆర్‌, చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డి, బాలకృష్ణ, విజయశాంతి, బండి సంజయ్‌, జైరాం రమేశ్‌, జయప్రకాశ్‌నారాయణ, షర్మిల వంటి ప్రముఖులు ఇక్కడ ప్రసంగాలు చేశారు. ఇక్కడి రమ్యమైదానానికి వైఎస్‌, చిరంజీవి ప్రచారానికి వచ్చారు. రోశయ్య ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం, కేసీఆర్‌  సీఎం హోదాలో విచ్చేశారు. కేపీహెచ్‌బీ పరిధి హైవేలో రాహుల్‌ గాంధీ జోడోయాత్ర కూడా కొనసాగింది.

న్యూస్‌టుడే, కేపీహెచ్‌బీకాలనీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు