లంచం కేసులో.. గెయిల్‌ డైరెక్టర్‌ అరెస్టు

ప్రభుత్వరంగ సంస్థ ‘గెయిల్‌’ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ ఈఎస్‌ రంగనాథన్‌ను సీబీఐ ఆదివారం అరెస్టు చేసింది. గెయిల్‌ పెట్రోకెమికల్‌ ఉత్పత్తులను డిస్కౌంట్‌కు విక్రయించేందుకు ప్రైవేటు కంపెనీల నుంచి రూ.50 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో

Published : 17 Jan 2022 04:41 IST

దిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ ‘గెయిల్‌’ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ ఈఎస్‌ రంగనాథన్‌ను సీబీఐ ఆదివారం అరెస్టు చేసింది. గెయిల్‌ పెట్రోకెమికల్‌ ఉత్పత్తులను డిస్కౌంట్‌కు విక్రయించేందుకు ప్రైవేటు కంపెనీల నుంచి రూ.50 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో ఇటీవల కేసు నమోదైంది. విచారణలో భాగంగా దిల్లీ, నోయిడా, కర్నాల్‌, పంచకుల, గురుగ్రామ్‌లలోని పలు ప్రాంతాలతో పాటు రంగనాథన్‌ కార్యాలయం, నివాసాల్లోనూ సీబీఐ సోదాలు నిర్వహించింది. ఇప్పటివరకు రూ.1.29 కోట్ల నగదు, బంగారం, పలు విలువైన వస్తువుల్ని స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ముగ్గురు మధ్యవర్తులు, ఇద్దరు వ్యాపారులను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని