17 ఏళ్ల కుర్రాడిని అపహరించిన చైనా సైనికులు

అరుణాచల్‌ ప్రదేశ్‌లోకి ప్రవేశించిన చైనా సైనికులు 17 ఏళ్ల కుర్రాడిని అపహరించారు. ఈ రాష్ట్రంలోని అప్పర్‌ సియాంగ్‌ జిల్లాలో ఈ ఘటన జరిగినట్లు అరుణాచల్‌ తూర్పు ఎంపీ తాపిర్‌ గావో బుధవారం

Updated : 20 Jan 2022 05:40 IST

దిల్లీ: అరుణాచల్‌ ప్రదేశ్‌లోకి ప్రవేశించిన చైనా సైనికులు 17 ఏళ్ల కుర్రాడిని అపహరించారు. ఈ రాష్ట్రంలోని అప్పర్‌ సియాంగ్‌ జిల్లాలో ఈ ఘటన జరిగినట్లు అరుణాచల్‌ తూర్పు ఎంపీ తాపిర్‌ గావో బుధవారం తెలిపారు. బాధితుడిని మిరామ్‌ తరోన్‌గా గుర్తించినట్లు చెప్పారు. అతడి స్నేహితుడు జానీ యాయింగ్‌ చైనా సైనికుల నుంచి తప్పించుకోగలిగాడని పేర్కొన్నారు. ఇద్దరూ జిడో గ్రామానికి చెందిన వేటగాళ్లని తెలిపారు. సాంగ్‌పో నది అరుణాచల్‌ ప్రదేశ్‌లోకి ప్రవేశించే చోట ఈ ఘటన జరిగిందని చెప్పారు. ఈ నదిని అస్సాంలో బ్రహ్మపుత్రగా పిలుస్తారు. చైనా చర్య గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేశానని, బాధితుడిని త్వరగా విడిపించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తాపిర్‌ తెలిపారు. 2020 సెప్టెంబరులోనూ అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఐదుగురు యువకులను చైనా సైన్యం అపహరించింది. వారం తర్వాత వారిని విడిచిపెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని