విదేశీ అతిథులు లేకుండానే గణతంత్ర వేడుకలు

ఈ ఏడాది గణతంత్ర వేడుకలను విదేశీ దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు లేకుండానే నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతి దృష్ట్యా ఈ నిర్ణయం

Updated : 20 Jan 2022 05:40 IST

దిల్లీ: ఈ ఏడాది గణతంత్ర వేడుకలను విదేశీ దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు లేకుండానే నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విదేశీ అతిథులు లేకుండానే గణతంత్ర వేడుకలు నిర్వహించడం వరుసగా ఇది రెండో ఏడాది కావడం గమనార్హం. మరోవైపు..ఈ నెల 27న వర్చువల్‌ విధానంలో జరగనున్న భారత్‌-మధ్య ఆసియా మొదటి సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యం ఇవ్వనున్నారు. కజక్‌స్థాన్‌, కిర్గిజ్‌ రిపబ్లిక్‌, తజికిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ అధ్యక్షుల భాగస్వామ్యంతో జరగనున్న ఈ సదస్సులో మోదీ ప్రసంగించనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ సదస్సులో ఆయా దేశాల అధినేతలు పాల్గొననుండటంతో గణతంత్ర వేడుకలకు విదేశీ అతిథిని ఆహ్వానించలేదని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని