మళ్లీ స్పైస్‌‘జెర్క్‌’

స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థకు చెందిన విమానాల్లో సాంకేతిక లోపాల పరంపర కొనసాగుతోంది. ఆ సంస్థకు చెందిన సరకు రవాణా విమానమొకటి (బోయింగ్‌ 737) కోల్‌కతా నుంచి మంగళవారం చైనాలోని చోంకింగ్‌కు వెళ్తుండగా వాతావరణ రాడార్‌ పనిచేయలేదు.

Published : 07 Jul 2022 03:59 IST

వాతావరణ రాడార్‌ పనిచేయకపోవడంతో వెనుదిరిగిన విమానం

దిల్లీ: స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థకు చెందిన విమానాల్లో సాంకేతిక లోపాల పరంపర కొనసాగుతోంది. ఆ సంస్థకు చెందిన సరకు రవాణా విమానమొకటి (బోయింగ్‌ 737) కోల్‌కతా నుంచి మంగళవారం చైనాలోని చోంకింగ్‌కు వెళ్తుండగా వాతావరణ రాడార్‌ పనిచేయలేదు. టేకాఫ్‌ అయిన అనంతరం ఆ వైఫల్యాన్ని గుర్తించిన పైలట్లు.. విమానాన్ని వెనక్కి మళ్లించి కోల్‌కతాలో సురక్షితంగా దించారు. గత 18 రోజుల్లో స్పైస్‌జెట్‌ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం ఇది ఎనిమిదోసారి.  ఇకపై ప్రతి విమాన ప్రయాణానికి ముందు తాము రెట్టింపు జాగ్రత్తగా ఉంటామని స్పైస్‌జెట్‌ సీఎండీ అజయ్‌ సింగ్‌ తెలిపారు.  స్పైస్‌జెట్‌ విమానాల్లో వరుస సాంకేతిక లోపాలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఆ సంస్థకు డీజీసీఏ బుధవారం షోకాజ్‌ తాఖీదు జారీ చేసింది.

* విస్తారా విమానయాన సంస్థకు చెందిన ఓ విమానం దిల్లీలో ల్యాండ్‌ అయ్యాక దానిలోని ఒక ఇంజిన్‌ పనిచేయని ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బ్యాంకాక్‌ నుంచి దిల్లీకి చేరుకున్నాక విమానంలోని రెండో నంబరు ఇంజిన్‌లో స్వల్ప ఎలక్ట్రికల్‌ లోపం తలెత్తిందని.. ఫలితంగా అది పనిచేయలేదని డీజీసీఏ తెలిపింది.

* రాయ్‌పుర్‌ నుంచి మంగళవారం ఇందోర్‌ చేరుకున్న ఇండిగో సంస్థ విమానంలో పొగ కమ్ముకున్న ఘటన తాజాగా వెలుగుచూసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని