ఎన్‌డీపీఎస్‌ నేరస్థులపై కనికరం చూపకూడదు: సుప్రీం

నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టెన్సస్‌ (ఎన్‌డీపీఎస్‌) కింద నేరాలు చేసిన వారు సమాజానికి అత్యంత ప్రమాదకరమని, వారిపై ఎలాంటి కనికరం చూపకూడదని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది

Published : 11 Aug 2022 05:15 IST

దిల్లీ: నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టెన్సస్‌ (ఎన్‌డీపీఎస్‌) కింద నేరాలు చేసిన వారు సమాజానికి అత్యంత ప్రమాదకరమని, వారిపై ఎలాంటి కనికరం చూపకూడదని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. ‘‘ఈ చట్టం కింద నేరాలు తీవ్రమైనవి. సమాజానికి వ్యతిరేకమైనవి. అటువంటి నేరాలకు పాల్పడిన వారికి అనుకూలంగా ఎలాంటి విచక్షణ ఉపయోగించకూడదు’’ అని ఓ పిటిషన్‌ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్‌ అజయ్‌ రస్తోగీ, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే... ప్రస్తుత కేసులో నిందితురాలు నిరక్షరాస్యురాలని, సీనియర్‌ పౌరురాలని..అందుకే ఆమెకు విధించిన 15 ఏళ్ల జైలు శిక్షను 12 ఏళ్లకు తగ్గిస్తున్నామని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని