సరే.. రేపు భేటీ పెట్టుకోండి

పంజాబ్‌ శాసనసభ ప్రత్యేక సమావేశంపై నెలకొన్న ప్రతిష్టంభన వీడింది. ఈ భేటీని ఈ నెల 27న నిర్వహించుకోవడానికి ఆ రాష్ట్ర గవర్నర్‌ బన్వారీలాల్‌ పురోహిత్‌ ఆదివారం అనుమతి మంజూరు

Published : 26 Sep 2022 04:20 IST

ఎట్టకేలకు పంజాబ్‌ అసెంబ్లీ సమావేశానికి గవర్నర్‌ పచ్చజెండా

చండీగఢ్‌: పంజాబ్‌ శాసనసభ ప్రత్యేక సమావేశంపై నెలకొన్న ప్రతిష్టంభన వీడింది. ఈ భేటీని ఈ నెల 27న నిర్వహించుకోవడానికి ఆ రాష్ట్ర గవర్నర్‌ బన్వారీలాల్‌ పురోహిత్‌ ఆదివారం అనుమతి మంజూరు చేశారు. దీంతో రాజ్‌భవన్‌కు ఆప్‌ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన కలహం తాత్కాలికంగా సద్దుమణిగింది. ప్రత్యేక సమావేశంలో చేపట్టాల్సిన అంశాల జాబితాను గవర్నర్‌కు అందజేసిన ఒకరోజు అనంతరం ఆయన అసెంబ్లీ భేటీకి అనుమతివ్వడం గమనార్హం. నిజానికి ఈ నెల 22న విశ్వాసపరీక్షను ఎదుర్కోవడానికి ఆప్‌ ప్రభుత్వం ఒకరోజు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని భావించింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి భాజపా ప్రయత్నిస్తోందంటూ ఈ విశ్వాసపరీక్ష భేటీని ఆప్‌ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని