సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా!

సర్వోన్నత న్యాయస్థానం జడ్జిగా జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ యు.యు.లలిత్‌ బాధ్యతలు చేపట్టాక కొలీజియం ప్రతిపాదించిన తొలి

Published : 28 Sep 2022 04:56 IST

కొలీజియం సిఫార్సు

ఈనాడు, దిల్లీ: సర్వోన్నత న్యాయస్థానం జడ్జిగా జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ యు.యు.లలిత్‌ బాధ్యతలు చేపట్టాక కొలీజియం ప్రతిపాదించిన తొలి పేరు ఇదే. ఆయన ప్రస్తుతం బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. 1965 ఫిబ్రవరి 9న బెంగాలీ కుటుంబంలో జన్మించిన ఈయన తండ్రి సలిల్‌ కుమార్‌ దత్తా కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. ఈయన బావ జస్టిస్‌ అమితవ రాయ్‌ 2015 నుంచి 2018 వరకు సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని