ఐరోపాలోలా భారత్‌లోనూ ప్రైవేటు జైళ్లు కట్టాలి: సుప్రీం

ఐరోపా తరహాలో భారత్‌లోనూ ప్రైవేటు కారాగారాలను నిర్మించాలని, ఇందుకు దేశంలోని కార్పొరేట్‌ సంస్థలు పూనుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. గురువారం భీమా కోరేగావ్‌ కేసులో నిందితుడు

Published : 30 Sep 2022 04:28 IST

దిల్లీ: ఐరోపా తరహాలో భారత్‌లోనూ ప్రైవేటు కారాగారాలను నిర్మించాలని, ఇందుకు దేశంలోని కార్పొరేట్‌ సంస్థలు పూనుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. గురువారం భీమా కోరేగావ్‌ కేసులో నిందితుడు గౌతమ్‌ నవలఖాను ఆరోగ్యకారణాల రీత్యా.. తలోజా జైలు నుంచి ఆస్పత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా నవలఖా తరఫు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ మాట్లాడుతూ.. జైళ్లలో రద్దీ ఎక్కువైపోయిందని, రోగులను చూడటానికి కేవలం ఆయుర్వేద వైద్యులు మాత్రమే అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ హృషికేశ్‌రాయ్‌ల ధర్మాసనం స్పందిస్తూ.. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ(సీఎస్‌ఆర్‌)లో భాగంగా దేశంలోని బడా సంస్థలు జైళ్లు నిర్మిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించింది. ఐరోపాలో ప్రైవేటు కారాగారాలు ఉన్నాయని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని