మండల్‌ విగ్రహ దిమ్మెను కూల్చడం అన్యాయం

బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత బీపీ మండల్‌ విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన దిమ్మెను కూల్చివేయడం అనుచితమని, ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ద్రావిడ దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు వి.కృష్ణారావు పేర్కొన్నారు.

Published : 01 Oct 2022 05:12 IST

ద్రావిడ దేశం వ్యవస్థాపకుడు కృష్ణారావు

చెన్నై (సాంస్కృతికం), న్యూస్‌టుడే: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత బీపీ మండల్‌ విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన దిమ్మెను కూల్చివేయడం అనుచితమని, ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ద్రావిడ దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు వి.కృష్ణారావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్‌ కల్పించడంలో మండల్‌ విశేష సేవలందించారని, అందుకు కృతజ్ఞతాపూర్వకంగా ఆయన విగ్రహాన్ని గుంటూరులో ఏర్పాటుచేసేందుకు సెప్టెంబరు 25న దిమ్మెను నిర్మించారన్నారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు గుంటూరు మేయర్‌ను అనుమతి కోరామన్నారు. అనుమతులు ఇవ్వకపోగా, దిమ్మెను కూల్చివేయడం న్యాయం కాదన్నారు. అనుమతుల్లో జాప్యం చేస్తే గుంటూరులో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. అనంతరం తిరుమావళవన్‌ మాట్లాడుతూ.. ఏ స్థలంలో శిలావిగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగిందో అక్కడే విగ్రహ ఏర్పాటుకు అనుమతి మంజూరుచేయాలని మనవి చేశారు. తమిళనాడు ప్రభుత్వం కూడా మండల్‌ విగ్రహ ఏర్పాటుకు కృషిచేయాలని కోరారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts