గాంధీని తలపించేలా ‘అసుర’ రూపం

మహాత్మా గాంధీని అసురుడిగా చూపిస్తూ ఏర్పాటు చేసిన దుర్గా మండపం తీవ్ర వివాదానికి దారితీసింది. దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అఖిల భారతీయ హిందూ మహాసభ పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని కస్బా ప్రాంతంలో ఈ మండపాన్ని ఏర్పాటు చేసింది.

Published : 04 Oct 2022 04:01 IST

కోల్‌కతాలో హిందూ మహాసభ దుర్గా మండపంపై దుమారం

మహాత్మా గాంధీని అసురుడిగా చూపిస్తూ ఏర్పాటు చేసిన దుర్గా మండపం తీవ్ర వివాదానికి దారితీసింది. దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అఖిల భారతీయ హిందూ మహాసభ పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని కస్బా ప్రాంతంలో ఈ మండపాన్ని ఏర్పాటు చేసింది. అందులోని దుర్గా మాత విగ్రహం వద్ద అసురుడి ముఖం.. గుండ్రటి కళ్లద్దాలతో బాపూను తలపించింది. దీనిపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం వివాదాస్పదమైన నేపథ్యంలో నిర్వాహకులు విగ్రహాన్ని మార్చారు. పోలీసుల ఒత్తిడి మేరకే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. హిందూ మహాసభ తీరును తృణమూల్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ ఖండించారు. ‘‘అసలు మాటలు కూడా రావడం లేదు. ఇంతకన్నా అవమానకరం ఇంకేమైనా ఉంటుందా? నవరాత్రి ఉత్సవ స్ఫూర్తినే ఇది దెబ్బతీసింది. ఈ మొత్తం వ్యవహారం అధికారుల దృష్టికి వచ్చింది. వారు తగిన చర్యలు తీసుకుంటున్నారు’’ పేర్కొన్నారు. గాంధీ జయంతి అయిన అక్టోబరు 2ను హిందూ మహాసభ బ్లాక్‌ డేగా పాటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని