ఒకే గురువును అందరూ ఆరాధించాలా..!

భారతదేశం లౌకిక దేశమని, ఇక్కడ తనకు ఇష్టమైన మతాన్ని ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ ప్రతి పౌరుడికీ ఉందని సుప్రీంకోర్టు సృష్టం చేసింది.

Published : 06 Dec 2022 04:59 IST

అదెలా సాధ్యం.. భారత్‌ లౌకిక దేశం
ఓ పిల్‌ను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు వ్యాఖ్యలు

భారతదేశం లౌకిక దేశమని, ఇక్కడ తనకు ఇష్టమైన మతాన్ని ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ ప్రతి పౌరుడికీ ఉందని సుప్రీంకోర్టు సృష్టం చేసింది. శ్రీశ్రీ ఠాకూర్‌ అనుకూల్‌ చంద్రను పరమాత్మగా ప్రకటించాలంటూ వేసిన ఓ వ్యాజ్యాన్ని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ల ధర్మాసనం సోమవారం కొట్టివేస్తూ.. ఈ వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు.. పిల్‌ వేసిన ఉపేంద్రనాథ్‌కు రూ.లక్ష జరిమానా విధించింది. ‘‘భారతదేశం లౌకిక దేశం. దేశ పౌరులంతా శ్రీశ్రీ ఠాకూర్‌ అనుకూల్‌చంద్రను పరమాత్మగా అంగీకరించి, ఆయన్ను ప్రార్థించాలంటూ వేసిన మీ పిటిషన్‌ను అనుమతించం. కావాలంటే మీరు ఆయనను పూజించుకోండి. ఇతరులపై ఎందుకు రుద్దుతారు..? మనది లౌకిక దేశం. ఒకే గురువును అందరూ అంగీకరించాలని మీరు అంటున్నారు. అదెలా సాధ్యం. భారత్‌లో ప్రతి ఒక్కరికీ తమ దేవుడిని ఎంపిక చేసుకొనే హక్కు ఉంది’’ అని జస్టిస్‌ షా అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని