Afghanistan: భారత్‌కు ఎలాంటి హాని తలపెట్టబోం: తాలిబన్ల ప్రతినిధి

భారత్‌ ముఖ్యమైన దేశమని.. అఫ్గాన్‌ నుంచి భారత్‌కు ఎలాంటి హాని జరగబోదని తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ వెల్లడించారు.....

Updated : 29 Feb 2024 14:12 IST

కాబుల్‌: భారత్‌ ముఖ్యమైన దేశమని.. అఫ్గాన్‌ నుంచి భారత్‌కు ఎలాంటి హాని జరగబోదని తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాలతో ఉన్న సత్సంబంధాల మాదిరిగానే.. తాలిబన్ల ఆధ్వర్యంలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వం భారత్‌తో మంచి సంబంధాలను ఆశిస్తున్నట్లు ఓ ఆంగ్ల మీడియాతో పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో చేతులు కలిపి భారత్‌ వ్యతిరేక కార్యకలాపాలు చేయబోతున్నారని వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.  ఇతర దేశాలను తాలిబన్లు ప్రమాదంలోకి నెట్టివేయరని వెల్లడించారు. అయితే పాకిస్థాన్ తమకు రెండో ఇల్లు లాంటిది అని కొద్దిరోజుల క్రితమే ముజాహిద్‌ పేర్కొనడం గమనార్హం.

పాకిస్థాన్‌ మా తాలిబన్లకు రెండో ఇల్లు వంటిది. ఆ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మా భూభాగంలో ఎలాంటి చర్యలను సాగనీయం అని ముజాహిద్‌ పేర్కొన్నారు. పాక్‌-అఫ్గాన్‌లు సరిహద్దులు పంచుకుంటాయని.. మతం విషయానికి వస్తే మా రెండు దేశాలు సహజ మిత్రులని తెలిపారు. భవిష్యత్తులో పాక్‌తో సంబంధాలు మెరుగుపర్చుకొనే అంశంపై దృష్టిపెడతామన్నారు. ‘అఫ్గానిస్థాన్‌ను మేము స్వాధీనం చేసుకోవడంలో పాక్‌ పాత్ర ఏమాత్రం లేదు. ఆ దేశం మా అంతర్గత వ్యవహారాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని