Published : 01/06/2021 11:35 IST

Galwan valley: చైనా సైన్యాన్ని విమర్శించినందుకు..

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ సైనికులపై తప్పుడు వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కియు జిమింగ్‌ అనే బ్లాగర్‌ను చైనా ప్రభుత్వం జైల్లో వేసింది. ఈ విషయాన్ని ‘గ్లోబల్‌ టైమ్స్‌’ వెల్లడించింది. అతడిని తొలుత అరెస్టు చేసి చైనా నేర చట్టాల కింద అభియోగాలను మోపింది. ఫిబ్రవరి 10న అతడు మైక్రోబ్లాగింగ్‌ ‘విబో’లో చైనా సైనికులను కించపర్చేలా  ఒక పోస్టు రాశాడు. అతడికి దాదాపు 25 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీంతో వెంటనే చైనా అధికారులు రంగంలోకి దిగి అదుపులోకి తీసుకున్నారు.

ఆ తర్వాత అతడు నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు ప్రకటించారు. ‘విబో వేదికపై నెటిజన్లను ఆకర్షించి ఫాలోవర్లను పెంచుకోవడం కోసం అలా చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో వాస్తవాలను వక్రీకరించి సైనికులను అవమానించినట్లు’ ఒప్పుకొన్నాడని వెల్లడించారు.  అతడి ఖాతాను విబో ఏడాదిపాటు బ్యాన్‌ చేసింది. అతడికి ఎనిమిది నెలల జైలు శిక్షను విధించారు.  దీంతోపాటు చైనాలోని సీసీటీవీలో బహిరంగ క్షమాపణ చెప్పించారు. ‘‘నేను చేసిన పనికి చాలా  సిగ్గుపడుతున్నాను. నా ప్రవర్తన ఒక ఆత్మవంచన ’’ అని పేర్కొన్నారు.

కియు జిమింగ్‌కు అక్కడి సామాజిక మాధ్యమం ‘వైబో’లో దాదాపు 25లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, గల్వాన్‌ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చైనా సైనికుల సంఖ్యపై సందేహాలు వ్యక్తం చేస్తూ అతడు రెండు పోస్టులు పెట్టాడు. గతేడాది జూన్‌లో జరిగిన గల్వాన్‌ ఘర్షణలో కమాండర్‌ స్థాయి అధికారి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఉన్నతాధికారి కావడం వల్లనే అతడు బతకగలిగాడు అని తొలి పోస్టులో పేర్కొన్నాడు. అధికారులు వెల్లడించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో చైనా సైనికులు ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చంటూ మరో పోస్టులో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. గల్వాన్‌ ఘర్షణలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఓ ఉన్నతాధికారికి తీవ్ర గాయాలు అయ్యాయని చైనా అధికారికంగా వెల్లడించిన తర్వాత కియూ జిమింగ్‌ ఈ విధంగా స్పందించాడు. దీంతో యువకుడి పోస్టులపై చైనా అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను వక్రీకరించి చైనా సైనికుల అపఖ్యాతికి కారణమయ్యారని ఆరోపిస్తూ అతడిపై తీవ్ర అభియోగాలు మోపినట్లు చైనా మీడియా వెల్లడించింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని