Karnataka : కర్ణాటక విద్యాసంస్థల్లో రాజ్యాంగ పీఠిక చదవడం తప్పనిసరి!

కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు రాజ్యాంగ పీఠికను (Preamble) చదవడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

Published : 15 Sep 2023 16:19 IST

బెంగళూరు : పాఠశాలలు, కళాశాలల్లో ఉదయం ప్రార్థనా సమయంలో తప్పనిసరిగా రాజ్యాంగ పీఠికను (Preamble) చదవాలని కర్ణాటక (Karnataka) రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) అసెంబ్లీ సమీపంలో రాజ్యాంగ పీఠికను చదివారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం సహా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రులు జి.పరమేశ్వర, రామలింగారెడ్డి, ఈశ్వర్‌ ఖండ్రే, కేజే జార్జ్‌, ఎమ్మెల్యే రిజ్వాన్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

‘హిందీ’ డైలాగులతో ఇజ్రాయెల్‌ ఎంబసీ వీడియో.. ప్రధాని మోదీ రిప్లై..

ఈ సందర్భంగా మంత్రి హెచ్‌సీ మహదేవప్ప మాట్లాడుతూ.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పౌరులందరికీ ఇచ్చిన బహుమతి భారత రాజ్యాంగం అని చెప్పారు. అది న్యాయం, సమానత్వం గురించి నొక్కి చెప్పే పవిత్ర శాసన గ్రంథమని పేర్కొన్నారు. పీఠిక చదవడం వెనుక ఓ ముఖ్యమైన ప్రయోజనం ఉందన్న ఆయన.. ఏ పునాదులపై మన దేశం నిర్మితమైందో విద్యార్థులంతా తెలుసుకునే వీలుందన్నారు. ‘మన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక విధులను పౌరులు నిర్వర్తించాలి. అందుకే పాఠశాలలు, కళాశాలల్లో రాజ్యాంగ ప్రవేశికను చదవడం తప్పనిసరి చేశాం. దాంతో పిల్లలకు రాజ్యాంగ విధుల గురించి తెలుస్తుంది. ఏ ఆదర్శాలు, సూత్రాల ఆధారంగా రాజ్యాంగం రూపొందించారో వారికి అవగాహన వస్తుందని’ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని