
Corona: కరోనా.. రెండేళ్ల ఆయువును తినేసింది..!
మహమ్మారితో తగ్గిన భారతీయుల ఆయుర్దాయం
ముంబయి: గత ఏడాదిన్నర కాలంగా ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి దాదాపు అన్ని రంగాలను కుదిపేసింది. ఆర్థికంగా, సామాజికంగా కోట్లాది మంది జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది. అంతేనా, కొవిడ్ కారణంగా భారతీయుల ఆయుర్దాయం కూడా రెండేళ్లు తగ్గినట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
ముంబయిలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్(ఐఐపీఎస్) ఈ అధ్యయనం చేపట్టింది. ఐఐపీఎస్ ప్రొఫెసర్ సూర్యకాంత్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనంలో కరోనా కారణంగా భారతీయుల ఆయుష్షు రెండేళ్ల మేర తగ్గినట్లు వెల్లడైంది. 2019లో పురుషుల ఆయుర్దాయం 69.5ఏళ్లుగా ఉండగా.. 2020 నాటికి అది 67.5ఏళ్లకు పడిపోయిందని నివేదిక వెల్లడించింది. ఇక మహిళల ఆయుర్దాయం రెండేళ్ల క్రితం 72ఏళ్లుగా ఉండగా.. గతేడాది నాటికి 69.8 ఏళ్లకు తగ్గినట్లు పేర్కొంది.
దేశవ్యాప్తంగా జనన, మరణాలపై కొవిడ్ మహమ్మారి ప్రభావాన్ని పరిశీలిస్తూ ఈ అధ్యయనం చేపట్టారు. కొవిడ్ కారణంగా గతేడాది నుంచి లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 35-69 మధ్య వయస్కులైన పురుషులే ఎక్కువగా మరణించినట్లు అధ్యయనం పేర్కొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.