Crime News: 100 కార్లను కొట్టేసిన ‘కార్‌ రాజా’ అరెస్టు

రాయల్‌ లైఫ్‌ కోసం అతను దొంగతనాలు ప్రారంభించాడు. పోలీసులకు చిక్కకుండా.. కార్లను కొట్టేయడం మొదలుపెట్టాడు. సీసీటీవీల్లోనూ అతని ఆచూకీ తెలియదు. ఒకటి, రెండు కాదు.. అతను దొంగిలించిన కార్ల సంఖ్య వందల్లో ఉంటుంది. ఒక్క ఏడాదిలో

Updated : 17 Jan 2022 07:34 IST

రాయల్‌ లైఫ్‌ కోసం అతను దొంగతనాలు ప్రారంభించాడు. పోలీసులకు చిక్కకుండా.. కార్లను కొట్టేయడం మొదలుపెట్టాడు. సీసీటీవీల్లోనూ అతని ఆచూకీ తెలియదు. ఒకటి, రెండు కాదు.. అతను దొంగిలించిన కార్ల సంఖ్య వందల్లో ఉంటుంది. ఒక్క ఏడాదిలో ఏకంగా 100 కార్లను కొట్టేసిన చరిత్ర అతనిది. ఈ కార్‌ రాజాపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ‘కార్‌ రాజా’ ఆగడాలకు ఎలాగైనా చెక్‌ పెట్టాలని భావించిన దిల్లీ పోలీసులు  రెండు నెలలు శ్రమించి నిందితుడిని పట్టుకున్నారు. ఈ అంతర్రాష్ట్ర దొంగ.. దిల్లీ ఎన్‌సీఆర్‌, యూపీ, కశ్మీర్‌ పరిధిలో కార్ల చోరీలకు పాల్పడుతుంటాడు. చిన్న కార్ల నుంచి లగ్జరీ కార్ల వరకు ఏదైనా క్షణాల్లో మాయం చేసి నంబర్‌ ప్లేట్లు తారుమారు చేసి కస్టమర్లకు అమ్మేస్తుంటాడు. అందుకే ఇతనికి ‘కార్‌ రాజా’ అని పేరు వచ్చింది. ఇతని అసలు పేరు..కునాల్‌ అలియాస్‌ తనుజ్‌ అలియాస్‌ విజయ్‌. ఈ నెల 11న అతను కారును విక్రయించేందుకు దిల్లీలోని మోనాస్ట్రీ మార్కెట్‌కు వస్తాడని పోలీసులకు సమాచారం అందింది. పథకం ప్రకారం నిందితుడిని అదే రోజు అరెస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని