MP Danish Ali: ఎంపీ డానిష్‌ అలీపై బీఎస్పీ సస్పెన్షన్‌ వేటు

MP Danish Ali suspended: ఎంపీ డానిష్‌ అలీపై బీఎస్పీ సస్పెన్షన్‌ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Published : 09 Dec 2023 20:15 IST

MP Danish Ali | దిల్లీ: బహుజన్‌ సమాజ్‌ పార్టీకి (BSP) చెందిన ఎంపీ డానిష్‌ అలీని ఆ పార్టీ సస్పెండ్‌ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో ఆయనపై చర్యలు తీసుకుంది. ‘‘పార్టీ విధానాలు, సిద్ధాంతాలు, క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు మౌఖికంగా పలుమార్లు హెచ్చరించినా.. పదే పదే పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారు. అందుకే పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నాం’’ అని బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీశ్‌ చంద్ర మిశ్రా ఓ ప్రకటనలో వెల్లడించారు.

గతంలో జేడీఎస్‌లో ఉన్న డానిశ్‌ అలీ.. 2018 కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్‌, బీఎస్పీ పొత్తులో పోటీ చేశారు. ఫలితాల అనంతరం దేవెగౌడ సూచన మేరకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహ సీటును బీఎస్పీ కేటాయించింది. 2019లో అమ్రోహ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు మిశ్రా తెలిపారు. అలీపై గతంలో భాజపా ఎంపీ రమేశ్‌ బిధూరీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో డానిష్‌ పేరు తెరపైకి వచ్చింది. అప్పట్లో విపక్ష పార్టీ నేతలు ఆయనకు అండగా నిలిచారు. రాహుల్ గాంధీ స్వయంగా ఆయనను కలిసి తన సంఘీభావం ప్రకటించారు. తాజాగా మహువా మొయిత్రాను సస్పెన్షన్‌ను అలీ తీవ్రంగా వ్యతిరేకించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని