Corona Wave: రానున్న 6-8 నెలల్లో మరో వేవ్‌..!

కరోనా మూడోవేవ్ అదుపులోకి రావడంతో.. భారత్‌ కాస్త ఊపిరిపీల్చుకుంటోంది. ప్రతిసారి కొత్త వేరియంట్లు వెలుగులోకి రావడంతో.. ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా వైరస్ విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే.

Updated : 22 Feb 2022 19:50 IST

దిల్లీ: కరోనా మూడోవేవ్ అదుపులోకి రావడంతో.. భారత్‌ కాస్త ఊపిరిపీల్చుకుంటోంది. ప్రతిసారి కొత్త వేరియంట్లు వెలుగులోకి రావడంతో.. ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా వైరస్ విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే మరో కొత్త వేరియంట్ పుట్టుకొస్తే.. రానున్న 6-8 నెలల్లో భారత్‌లో మరోవేవ్ రావొచ్చని ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ రాజీవ్ జయదేవన్ అంచనావేశారు. అలాగే ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ల తీవ్రత గురించి వెల్లడించారు. బీఏ.1 కంటే బీఏ.2కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్నప్పటికీ..  ఇది మరోవేవ్‌కు దోహదం చేయదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

‘వైరస్ చాలా కాలం పాటు దశలవారీగా విజృంభిస్తూనే ఉంటుంది. కొత్త వేరియంట్ ఎప్పుడు వస్తే.. అప్పుడే మరో వేవ్ ఉంటుంది. అయితే అది ఎప్పుడో చెప్పలేం. ఇప్పటివరకు జరిగిన పరిణామాలను గమనిస్తే.. అది  6-8 నెలల్లో కావొచ్చు. కానీ, వైరస్ మన చుట్టూనే ఉంటుంది. దానిని కట్టడిచేసేందుకు మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే’ అని స్పష్టం చేశారు. 

‘టీకా నిరోధకతను కొత్త వేరియంట్లు ఏమార్చగలవని ఒమిక్రాన్ నిరూపించింది. భవిష్యత్తులో వచ్చే వేరియంట్ల వల్ల కూడా ఆ పరిస్థితి తలెత్తొచ్చు. సహజంగా లేక టీకా వల్ల నిరోధకత వచ్చినా.. వైరస్ మనకు సోకుతుంది’ అని వెల్లడించారు. భవిష్యత్తులో వచ్చే వేరియంట్లు టీకా నిరోధకతను ఏమార్చుతాయా..? అని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని