Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని బెదిరిస్తూ ఫోన్‌ కాల్‌

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని చంపేస్తానంటూ ఓ దుండగుడు కాల్‌ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు.

Published : 14 Jan 2023 16:54 IST

నాగ్‌పూర్‌: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gdkari)ని బెదిరిస్తూ ఇవాళ ఉదయం నుంచి రెండు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. నాగ్‌పూర్‌లోని నితిన్‌ గడ్కరీ కార్యాలయంలోని ల్యాండ్‌లైన్‌ నంబర్‌కు ఫోన్‌ చేసిన ఓ దుండగుడు ఆయన్ని చంపేస్తానని, కార్యాలయాన్ని కూడా పేల్చివేస్తానని బెదిరించినట్లు సమాచారం. ఇవాళ ఉదయం 11.30 గంటలు, 11.40 గంటల సమయంలో  కాల్స్‌ వచ్చినట్లు అక్కడి సిబ్బంది చెప్పారు. దీనిపై  పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. నితిన్‌ గడ్కరీ నివాసానికి, ఆయన కార్యాలయానికి కేవలం కిలోమీటరు దూరమే ఉండటంతో  భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్‌ డేటా ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని