Agnipath: ఇది నిరుద్యోగుల పాలిట అగ్నిబాట : రాహుల్ గాంధీ

సాయుధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ (Agnipath) పథకం నిరుద్యోగులను అగ్నిబాటపై నడిచేలా చేసిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

Published : 19 Jun 2022 15:41 IST

దిల్లీ: సాయుధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ (Agnipath) పథకం నిరుద్యోగులను అగ్నిబాటపై నడిచేలా చేసిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగాలపై ప్రధానమంత్రి పదేపదే తప్పుడు ఆశలు కల్పించి వారిని అగ్నిమార్గంలో పయణించేలా చేశారని మండిపడ్డారు. అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు.

‘ఉద్యోగాలపై తప్పుడు ఆశలు కల్పించడం ద్వారా దేశంలోని యువతను నిరుద్యోగం అనే ‘అగ్నిబాట’పై నడిచేలా చేశారు. గడిచిన 8 ఏళ్లలో 16కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. కానీ, యువతకు మాత్రం పకోడీలు ఫ్రై చేసుకునే జ్ఞానం మాత్రమే కల్పించారు. దేశంలో నెలకొన్న ఇటువంటి పరిస్థితికి ప్రధానమంత్రే బాధ్యత వహించాలి’ అని కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, అగ్నిపథ్‌ పథకాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతోన్న యువతకు సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్‌ పార్టీ నేడు దేశ రాజధానిలో ‘సత్యాగ్రహం’ చేపట్టింది. దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కొనసాగుతోన్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ, ఏఐసీసీ వర్కింగ్‌ కమిటీ సభ్యులతోపాటు పార్టీకి చెందిన ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు