Russia:తాలిబన్ల తరపున రంగంలోకి రష్యా..

అఫ్గానిస్థాన్లోని పంజ్‌షీర్‌ లోయలో తాలిబన్లకు ఎదురొడ్డి నిలిచిన ప్రతిఘటన దళాలతో చర్చలు జరపడంలో అవసరమైతే చురుకైన పాత్ర పోషించేందుకు రష్యా సిద్ధంగా

Published : 22 Aug 2021 19:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అఫ్గానిస్థాన్‌లోని పంజ్‌షీర్‌ లోయలో తాలిబన్లకు ఎదురొడ్డి నిలిచిన ప్రతిఘటన దళాలతో చర్చలు జరపడంలో అవసరమైతే చురుకైన పాత్ర పోషించేందుకు రష్యా సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని కాబుల్‌లోని రష్యా రాయబారి దిమిత్రి జిర్నోవ్‌ తెలిపారు. తాము ఇచ్చిన డీల్‌పై పంజ్‌షీర్‌లోని దళాలతో చర్చించాలని తాలిబన్లు కోరినట్లు ఆయన పేర్కొన్నారు. రష్యా మధ్యవర్తిత్వంతో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తాలిబన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాలిబన్లు రక్తపాతం కోరుకోవడంలేదని రష్యా రాయబారి వెల్లడించారు.

ఒకప్పుడు అహ్మద్‌ షా మసూద్‌ నేతృత్వంలో తాలిబన్లను అడుగు పెట్టనీయని పంజషీర్‌ వాసులు ఈ సారి కూడా పోరాటానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి దళాలు అన్నీ సిద్ధమవుతున్న వీడియోలు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పటికే అఫ్గాన్‌ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లాహ్‌ సలేహ్‌ పంజషీర్‌కు చేరుకొని  అహ్మద్‌షా మసూద్‌ తనయుడు అహ్మద్‌ మసూద్‌, రక్షణ మంత్రి బిస్మిల్లా మహమ్మద్‌తో భేటీ అయ్యారు. ఈ బృందం అమెరికాను ఆయుధాలు, ఇతర సాయం కోరినట్లు వాషింగ్టన్‌ పోస్టుకు మసూద్‌ కుమారుడు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని