Supreme Court: 15 రోజుల్లోపు లొంగిపోండి.. కొవిడ్ వేళ విడుదలైన ఖైదీలకు ఆదేశం
కరోనా సమయంలో జైళ్లలో రద్దీని తగ్గించే క్రమంలో విడుదలైన దోషులు, విచారణ ఖైదీలు.. 15 రోజుల్లోపు సంబంధిత జైలు అధికారుల ముందు లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అనంతరం శిక్ష రద్దు, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
దిల్లీ: కొవిడ్(COVID-19) ఉద్ధృతి వేళ జైళ్లలో రద్దీని తగ్గించేందుకుగానూ.. శిక్ష అనుభవిస్తోన్న దోషులు(Convicts), విచారణ ఖైదీల(Undertrial Prisoners)ను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, వారందరూ 15 రోజుల్లోపు సంబంధిత జైలు అధికారుల ముందు లొంగిపోవాలని సుప్రీం కోర్టు(Supreme Court) శుక్రవారం ఆదేశించింది. మహమ్మారి సమయంలో అత్యవసర, మధ్యంతర బెయిళ్లపై విడుదలైనవారు ఈ మేరకు లొంగిపోవాలని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
లొంగిపోయిన అనంతరం విచారణ ఖైదీలు.. రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ధర్మాసనం తెలిపింది. అదే విధంగా దోషులు సైతం లొంగిపోయిన తర్వాత.. తమ శిక్షను రద్దు చేయాలని కోరుతూ, చట్టాలకు లోబడి న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని చెప్పింది. ఇదిలా ఉండగా.. కరోనా తీవ్రత దృష్ట్యా ‘సుప్రీం’ ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సుల మేరకు.. వివిధ రాష్ట్రాల్లో స్వల్ప తీవ్రత కలిగిన నేరాలకు పాల్పడిన అనేక మంది నేరస్థులు, విచారణ ఖైదీలను విడుదల చేశారు. తాజాగా వారందరూ లొంగిపోవాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Amaravati: కాగ్ నివేదికలు వైకాపా అసమర్థ పాలనకు నిదర్శనం: ఎమ్మెల్సీ అశోక్‌బాబు
-
Kharge: మహిళా రిజర్వేషన్ల బిల్లు.. అది భాజపా గారడీనే: ఖర్గే
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?
-
Crime news మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. కస్టడీ నుంచి పారిపోయేందుకు నిందితుడి యత్నం!
-
Janasena: తెదేపాతో కలిసి సమస్యలపై పోరాడాలి: నాదెండ్ల మనోహర్
-
Social Look: నజ్రియా వెకేషన్.. నయన్ సెలబ్రేషన్స్..!