
Assam: పోలీసుస్టేషన్‌కు నిప్పు.. బుల్డోజర్లతో నిందితుల ఇళ్ల కూల్చివేత
గువాహటి : అస్సాంలోని నగావ్ జిల్లాలో పోలీస్‌స్టేషన్‌కు నిప్పంటించిన ఘటనలో అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో కారకులైన ఐదు కుటుంబాలకు సంబంధించిన ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేశారు. కేసుకు సంబంధించి 23 మందిని అదుపులోకి తీసుకున్నామని డీఐజీ సత్యరాజ్ హజారికా తెలిపారు. నిందితుల్లో నలుగురు మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు. దర్యాప్తు సజావుగా సాగుతోందని, బటద్రవా స్టేషన్ ఇంఛార్జ్‌ను సైతం సస్పెండ్ చేసినట్లు డీఐజీ వెల్లడించారు. పోలీస్‌స్టేషన్‌కు నిప్పంటించడం లాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మృతుడి బంధువుల్లో పలువురికి క్రిమినల్ రికార్డులు ఉన్నాయని తెలిపారు.
అసోం నగావ్ జిల్లాలోని బటద్రవా పోలీస్‌స్టేషన్‌కు గుర్తుతెలియని దుండగులు శనివారం నిప్పంటించారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా పలువురికి గాయాలయ్యాయి. సలోనిబరి ప్రాంతానికి చెందిన చిరు వ్యాపారి సఫీకుల్ ఇస్లాం శుక్రవారం రాత్రి వ్యాపార నిమిత్తం వేరే ప్రాంతానికి వెళుతుండగా.. బటద్రవా పోలీసులు అడ్డుకొని అతడి నుంచి రూ. 10వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచం ఇవ్వకపోవడంతో పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి.. కుటుంబ సభ్యుల ముందే కొట్టినట్లు స్థానికులు ఆరోపించారు.
సఫీకుల్ కుటుంబసభ్యులు తిరిగి రూ.10వేలతో పోలీసుస్టేషన్‌కు వెళ్లగా.. అప్పటికే అతడ్ని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారని పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన సఫీకుల్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసు స్టేషన్‌ను ముట్టడించి నిప్పంటించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Car Loan: ఈఎంఐ భారం కావొద్దంటే కారు లోన్‌కు ఏ వడ్డీరేటు బెటర్?
-
Sports News
IND vs IRE : అందుకే ఆఖరి ఓవర్‌ను ఉమ్రాన్‌కు ఇచ్చా : హార్దిక్ పాండ్య
-
Politics News
Telangana News: హైదరాబాద్‌లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు
-
Politics News
Maharashtra: ‘మహా’ సంక్షోభం.. ఠాక్రే సర్కారుకు రేపే బలపరీక్ష
-
India News
India Corona: లక్షకు చేరువగా క్రియాశీల కేసులు..!
-
Business News
Stock Market Update: నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్‌పుర్
- IND vs IRE : గెలిచారు.. అతి కష్టంగా
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి సస్పెన్షన్
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
- ‘Disease X’: డిసీజ్ ఎక్స్.. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు..?
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- DilRaju: తండ్రైన దిల్‌రాజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని