Manish Sisodia: తన అరెస్టును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు సిసోదియా

దిల్లీ ఉపముఖ్యంత్రి మనీశ్ సిసోదియా(Manish Sisodia) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం కుంభకోణం కేసులో తన అరెస్టును సవాలు చేశారు. 

Updated : 28 Feb 2023 11:55 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో తన అరెస్టును, కేంద్రదర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ తీరును సవాలు చేస్తూ దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా(Manish Sisodia) మంగళవారం సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. ఈ కేసులో ఆదివారం సీబీఐ(CBI) ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఐదురోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ దిల్లీ కోర్టు నిన్న ఉత్తర్వులిచ్చింది. ఈ పరిమాణాల నేపథ్యంలో ఆయన సుప్రీం మెట్లెక్కారు. సిసోదియా అభ్యర్థనను అత్యవసర విచారణ నిమిత్తం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ముందు ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది.

సిసోదియా కస్టడీకి దిల్లీ కోర్టు షరతులు..

* ఐదురోజుల కస్టడీలో భాగంగా సిసోదియా(Manish Sisodia)ను విచారించే స్థలమంతా సీసీటీవీ కవరేజ్ ఉండాలి. దానికి సంబంధించిన ఫుటేజ్‌ను సీబీఐ భద్రపరచాలి. 

* దిల్లీ (Delhi) డిప్యూటీ సీఎంకు ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలి.

* సిసోదియా(Manish Sisodia) ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య ఒక అరగంటపాటు తన తరఫు న్యాయవాదులను కలుసుకోవచ్చు. వారిమధ్య జరిగే సంభాషణను దర్యాప్తు సంస్థ అధికారులు వినేందుకు వీలులేదు. 

* ప్రతిరోజూ 15 నిమిషాల పాటు ఆయన సతీమణితో మాట్లాడేందుకు అనుమతి ఉంది. అలాగే వైద్యులు రాసిచ్చిన మందులు వేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని