NTAGI: యాంటీబాడీలు తగ్గిపోతాయ్‌.. బూస్టర్‌ డోసు త్వరగా తీసుకోండి..!

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న దృష్ట్యా వీలైనంత తొందరగా బూస్టర్‌ డోసులు (Booster Dose) తీసుకోవాలని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (NTAGI) ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోఢా సూచించారు.

Published : 01 Sep 2022 02:27 IST

కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ చీఫ్‌ ఎన్‌కే అరోరా సూచన

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ (Coronavirus) విజృంభణ కొనసాగుతున్న దృష్ట్యా వీలైనంత తొందరగా బూస్టర్‌ డోసులు (Booster Dose) తీసుకోవాలని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (NTAGI) ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోరా సూచించారు. ముందుగా తీసుకున్న వ్యాక్సిన్‌ల నుంచి పొందిన యాంటీబాడీలు ఆరు నుంచి ఎనిమిది నెలల్లో తగ్గిపోతుండటంతో వీలైనంత తొందరగా ప్రికాషనరీ డోసు (Booster Dose) తీసుకోవాలని స్పష్టం చేశారు.

‘వివిధ రకాల వైరస్‌లతోపాటు కొవిడ్‌-19 కూడా వ్యాప్తిలో ఉంది. అదృష్టవశాత్తూ అది తీవ్ర ప్రభావాన్ని చూపించకపోవడంతోపాటు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయినప్పటికీ మనచుట్టూ కరోనా వ్యాప్తి కొనసాగుతోందన్న విషయాన్ని మరచిపోవద్దు’ అని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌కే అరోరా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బూస్టర్‌ డోసు తీసుకోవాలని సూచించిన ఆయన.. భవిష్యత్తులో మన ఆరోగ్యానికి అది ఇన్సూరెన్స్‌గా పనిచేస్తాయని అన్నారు. గడిచిన ఎనిమిది నెలల్లో ఆస్పత్రి పాలైన కరోనా రోగుల్లో 90శాతం మంది బూస్టర్‌ తీసుకోని వారేనని ఎన్‌కే అరోరా స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే, దేశంలో నిత్యం వేల సంఖ్యలో కొవిడ్‌ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 7231 కేసులు నమోదయ్యాయి. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 64,667కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని