Ajay Mishra: రెండు నిమిషాల్లో అందరినీ దారికి తెస్తా!

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్ర తీవ్ర స్వరంతో హెచ్చరిస్తున్న వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం

Published : 05 Oct 2021 07:11 IST

  గతంలో రైతుల్ని హెచ్చరించిన అజయ్‌ మిశ్ర

లఖ్‌నవూ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్ర తీవ్ర స్వరంతో హెచ్చరిస్తున్న వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం నాటి లఖింపుర్‌ఖేరి ఘటనకు 9 రోజుల ముందు (సెప్టెంబరు 25న) ఈ దృశ్యాలు రికార్డయినట్లుగా తెలుస్తోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖేరి లోక్‌సభ నియోజకవర్గంలో అజయ్‌ మిశ్ర పర్యటిస్తుండగా పాలియా అనే ప్రాంతంలో రైతులు నల్లజెండాలతో నిరసన తెలిపినప్పటి వీడియో అది. మంత్రి ఆగ్రహంతో మాట్లాడుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. ‘‘నేను తలచుకుంటే మిమ్మల్ని అందరినీ దారిలోకి తీసుకురావడానికి రెండు నిమిషాలకు మించి సమయంపట్టదు’’ అని మంత్రి హెచ్చరించారు. ‘‘నేను ఒక మంత్రి, ఎంపీని మాత్రమే కాదు...లోక్‌సభకు ఎన్నిక కావడానికి చాలా ముందు నుంచే నేనేమిటో ప్రజలకు బాగా తెలుసు. ఒక్కసారి సవాల్‌ను స్వీకరించానంటే వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. నేను రంగంలోకి దిగానంటే మీరు పాలియా(ఆ ప్రాంతం పేరు) నుంచే కాదు లిఖింపుర్‌ను కూడా వదిలి పారిపోవాల్సిందే’’ అని మంత్రి హెచ్చరించారు. ఈ ఘటన తర్వాత నుంచి ఆ ప్రాంతంలోని రైతులు మంత్రిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని