Sushmita Dev: కాంగెస్ పార్టీకి మరో షాక్‌

మరో కీలక నేత, అస్సాంకు చెందిన సుష్మితా దేవ్ సోమవారం కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆల్‌ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో ఉన్న ఆమె పార్టీని వీడటం కాంగ్రెస్‌ను పెద్ద దెబ్బనే చెప్పాలి. అలాగే ఈ రోజు ఆమె తృణమూల్ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.  

Published : 16 Aug 2021 22:54 IST

పార్టీని వీడిన కీలక నేత సుష్మితా దేవ్‌

దిల్లీ: మరో కీలక నేత, అస్సాంకు చెందిన సుస్మితా దేవ్ సోమవారం కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆల్‌ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో ఉన్న ఆమె పార్టీని వీడటం కాంగ్రెస్‌ను పెద్ద దెబ్బనే చెప్పాలి. అలాగే ఈ రోజు ఆమె తృణమూల్ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.  

ఈ రోజు ఉదయం ట్విటర్‌ బయోను కాంగ్రెస్ ‘మాజీ సభ్యురాలు’ అని మార్చడంతో  పార్టీని వీడుతున్నారనే వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఆమె పార్టీని వీడినట్లు సీనియర్‌నేత కపిల్సిబల్ ధ్రువీకరించారు. కాగా, సుస్మిత ప్రస్తుతం కోల్‌కతాలో  ఉన్నారు. ఆమె తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆ పార్టీ నేత అభిషేక్ బెనర్జీతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ‘ఒకవేళ ఆమె తృణమూల్‌లో చేరితే.. అస్సాంలో ఆ పార్టీకి చెందిన కీలక నేతగా మారనున్నారు’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 

ప్రజా సేవలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు పార్టీని వీడుతున్నట్లు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖలో సుష్మిత పేర్కొన్నారు. ఆమె తండ్రి సంతోశ్ మోహన్ దేవ్ అస్సాంలో అత్యంత ప్రజాదరణ ఉన్న కాంగ్రెస్‌ నేత. ఇదిలా ఉండగా.. వరుసగా ఒక్కో నేత పార్టీని వీడుతుండటంతో కాంగ్రెస్ వైఖరిని సిబల్ తప్పుపట్టారు. పార్టీలో భారీమార్పులు అవసరం అంటూ గతంలో ఆయన అసమ్మతి గళం వినిపించిన సంగతి తెలిసిందే.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని