Omicron: భారత్‌లో థర్డ్ వేవ్ రాబోతోందా?డబ్ల్యూహెచ్‌ఓ అధికారి ఏమన్నారంటే..
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే 59 దేశాలకు వ్యాపించింది. భారత్‌లో ఇప్పటి వరకు 33 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మూడో వేవ్ రాబోతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు....
దిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే 59 దేశాలకు వ్యాపించింది. భారత్‌లో ఇప్పటి వరకు 34 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మూడో వేవ్ రాబోతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త వేరియంట్ వచ్చినంత మాత్రాన దయనీయమైన పరిస్థితులు తలెత్తుతాయని భావించాల్సిన అవసరం లేదన్నారు. అయితే, కొంత అనిశ్చితి మాత్రం ఉంటుందని తెలిపారు.
మహమ్మారి ఇంకా అంతం కాలేదని పూనమ్ తెలిపారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కేసులు ప్రమాదకర స్థాయిలో నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణాసియా ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్ని మరింత పటిష్ఠం చేయాలని సూచించారు. అలాగే వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలన్నారు.
ఇప్పటికే ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడం, అలాగే అనేక పరివర్తనాలు వెలుగుచూసిన నేపథ్యంలో.. ఈ కొత్త వేరియంట్ ప్రభావం తీవ్రంగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయని పూనమ్ అభిప్రాయపడ్డారు. అయితే, అది ఎలాంటి ప్రభావం అనేది మాత్రం ఇప్పుడే నిర్ధారించలేమన్నారు. మరింత స్పష్టత కోసం ప్రతి దేశం సమగ్రమైన సమాచారం పంపాలని కోరారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ వ్యాప్తి, తీవ్రత, ఇన్ఫెక్షన్ రేటు, లక్షణాలను నిర్ధారించడానికి విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయన్నారు.
దక్షిణాఫ్రికా నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఒమిక్రాన్ వల్ల రీఇన్ఫెక్షన్లు అధికంగా నమోదవుతున్నాయని పూనమ్ తెలిపారు. అలాగే డెల్టాతో పోలిస్తే వ్యాధి తీవ్రత కూడా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. కానీ, ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం సరికాదన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Bill Gates: మళ్లీ ప్రేమలో పడిన బిల్‌గేట్స్..?
-
Sports News
IND vs AUS: టీ బ్రేక్.. స్వల్ప వ్యవధిలో వికెట్లు ఢమాల్.. ఆసీస్ స్కోరు 174/8 (60)
-
Movies News
Janhvi Kapoor: వాళ్ల సూటిపోటి మాటలతో బాధపడ్డా: జాన్వీకపూర్
-
Politics News
Nara Lokesh - Yuvagalam: మరోసారి అడ్డుకున్న పోలీసులు.. స్టూల్‌పైనే నిల్చుని నిరసన తెలిపిన లోకేశ్
-
India News
Mallikarjun Kharge: వాజ్‌పేయీ మాటలు ఇంకా రికార్డుల్లోనే..’: ప్రసంగ పదాల తొలగింపుపై ఖర్గే
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు