ZyCOV-D: జైకోవ్‌-డి టీకా ధరపై వచ్చే వారంలో నిర్ణయం

దేశంలో మరో టీకా అందుబాటులోకి వచ్చేస్తోంది. గుజరాత్‌కు చెందిన ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా సంస్థ అభివృద్ధ చేసిన ‘జైకోవ్‌-డి’ వ్యాక్సిన్‌ అత్యవసర

Updated : 21 Aug 2021 19:37 IST

సెప్టెంబరులో పంపిణీ ప్రారంభిస్తామని జైడస్‌ ఎండీ

దిల్లీ: దేశంలో మరో టీకా అందుబాటులోకి వచ్చేస్తోంది. గుజరాత్‌కు చెందిన ఫార్మాసంస్థ జైడస్‌ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన ‘జైకోవ్‌-డి’ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా టీకాకు అనుమతులు రావడంపై జైడస్‌ గ్రూప్‌ ఎండీ శార్విల్‌ పటేల్‌ హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే వ్యాక్సిన్‌ ధరను ప్రకటిస్తామని వెల్లడించారు. 

‘‘జైకోవ్‌-డి టీకా కరోనా వైరస్‌పై 66శాతం సమర్థతతో పనిచేస్తుంది. ఈ టీకాను 0-28-56 రోజుల వ్యవధిలో మూడు డోసులుగా తీసుకోవాలి. 12ఏళ్ల పైబడిన వారికి ఈ టీకా ఇచ్చేందుకు అనుమతులు లభించాయి. వ్యాక్సిన్‌ ధరపై వచ్చే వారంలో స్పష్టతనిస్తాం. సెప్టెంబరు మధ్య నుంచి టీకా సరఫరా ప్రారంభిస్తాం. అక్టోబరు నుంచి నెలకు కోటి డోసులను ఉత్పత్తి చేసేందుకు నిర్ణయించాం’’ అని శార్విల్ వివరించారు. 

‘జైకోవ్‌-డి’ వ్యాక్సిన్‌ దేశీయ పరిజ్ఞానంతో తయారైన రెండో టీకా. అయితే ప్రపంచంలోనే డీఎన్‌ఏ ఆధారంగా రూపొందిన తొలి వ్యాక్సిన్‌ ఇదే కావడం విశేషం. ఈ టీకాను నేరుగా చర్మంలోకి ఎక్కిస్తారు. ఇందుకోసం సూది అవసరం ఉండదు. నొప్పి లేకుండా ‘ఫార్మాజెట్‌’ అనే సాధనం ద్వారా దీన్ని ఎక్కిస్తారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని