Yogi Adityanath: కొవిడ్‌తో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ₹10లక్షలు

కరోనా సమయంలో ప్రాణాల్ని లెక్కచేయకుండా విధులు నిర్వహించి వైరస్‌ కాటుకు బలైపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం అండగా ....

Published : 01 Aug 2021 01:04 IST

లఖ్‌నవూ: కరోనా సమయంలో ప్రాణాల్ని లెక్కచేయకుండా విధులు నిర్వహించి వైరస్‌ కాటుకు బలైపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయిన 55మంది పాత్రికేయుల కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రూ.10లక్షల చొప్పున సాయం అందించారు. ఈ మేరకు లోక్‌భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో చెక్కులు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ బారిన పడి అనేకమంది ఎడిటర్లు, పాత్రికేయులు, మీడియా సిబ్బంది తమ ప్రాణాల్ని కోల్పోయారన్నారు. ఆ లోటును పూడ్చలేమని, కానీ ఆ కుటుంబాలకు అండగా నిలబడగలమని తెలిపారు. పాత్రికేయ సిబ్బందికి అన్నివిధాలా తోడ్పాటు అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. పాత్రికేయ సిబ్బంది సేవలను ప్రశంసించారు. రాష్ట్రంలో దాదాపు 25వేలమంది పాత్రికేయులకు వ్యాక్సిన్‌ వేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో సరిపడా వ్యాక్సిన్‌ నిల్వలు ఉన్నాయని, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని