రోడ్డు పక్కన 2 లక్షల కరోనా టీకాలు

ఓ వైపు రాష్ట్రాలన్నీ కరోనా వ్యాక్సిన్ల కొరతతో సతమతమవుతున్న వేళ మధ్యప్రదేశ్‌లో రోడ్డు పక్కన కరోనా టీకాలతో ఉన్న ట్రక్కును వదిలేసి వెళ్లడం కలకలం సృష్టిస్తోంది. నర్సింగ్‌పూర్‌ జిల్లాలో శనివారం

Updated : 01 May 2021 14:40 IST

మధ్యప్రదేశ్‌లో కలకలం

భోపాల్‌: ఓ వైపు రాష్ట్రాలన్నీ కరోనా వ్యాక్సిన్ల కొరతతో సతమతమవుతున్న వేళ మధ్యప్రదేశ్‌లో రోడ్డు పక్కన కరోనా టీకాలతో ఉన్న ట్రక్కును వదిలేసి వెళ్లడం కలకలం సృష్టిస్తోంది. నర్సింగ్‌పూర్‌ జిల్లాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

కరేలీ ప్రాంతంలో బస్టాండ్‌కు సమీపంలో ఓ ట్రక్కు చాలా సేపు ఆగి ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ట్రక్కును తెరిచి చూడగా.. అందులో దాదాపు 2,40,000 డోసుల కొవాగ్జిన్‌ టీకాలు కన్పించాయి. డ్రైవర్‌, క్లీనర్‌ కన్పించలేదు. ట్రక్కు మీదున్న నంబరుతో డ్రైవర్‌ మొబైల్‌ లోకేషన్‌ను ట్రేస్‌ చేయగా.. హైవే సమీపంలోని చెట్ల పొదల్లో ఉన్నట్లు గుర్తించారు. 

ట్రక్కులోని ఎయిర్ కండిషన్‌ పనిచేస్తుందని, డోసులు సురక్షితంగానే ఉన్నాయని పోలీసులు తెలిపారు. వాటి విలువ దాదాపు 8కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ట్రక్కును స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్‌, క్లీనర్‌ కోసం గాలిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని