SA Bobde: ‘సంస్కృతం ఎందుకు అధికార భాష కాకూడదు..?’ మాజీ సీజేఐ బోబ్డే
సంస్కృతం దేశ అధికార భాష ఎందుకు కాకూడదని మాజీ సీజేఐ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే అన్నారు. గతంలో డా.బీఆర్ అంబేడ్కర్ ఇదే విషయాన్ని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు.
ముంబయి: న్యాయస్థానాల్లో వినియోగంతో సహా దేశ అధికార భాష(Official Language)గా సంస్కృతం(Sanskrit) ఎందుకు ఉండకూడదని మాజీ సీజేఐ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే(SA Bobde) వ్యాఖ్యానించారు. రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ (BR Ambedkar) సైతం గతంలో ఇదే విషయాన్ని ప్రతిపాదించారని గుర్తుచేశారు. సంస్కృత భారతి ఆధ్వర్యంలో శుక్రవారం నాగ్‌పుర్‌లో నిర్వహించిన ‘అఖిల భారతీయ ఛత్ర సమ్మేళన్’లో జస్టిస్ బోబ్డే పాల్గొని మాట్లాడారు. ఈ భాష దక్షిణ లేదా ఉత్తర భారతదేశానికి చెందింది కాదని, లౌకిక వినియోగానికి సంపూర్ణ సామర్థ్యం కలిగి ఉందన్నారు.
‘దేశంలో అధికార భాష సమస్య అపరిష్కృతంగా ఉండకూడదని భావిస్తున్నా. 1949లో డా.అంబేడ్కర్ సంస్కృతాన్ని ‘యూనియన్ ఆఫ్ ఇండియా’ అధికార భాషగా ఉండాలనే దిశగా చొరవ తీసుకున్నట్లు వార్తాసంస్థలు పేర్కొన్నాయి. మన ప్రాంతీయ భాషలతో మమేకమయ్యే ఏకైక భాష సంస్కృతం. ఉర్దూతోసహా అనేక ప్రాంతీయ భాషల్లో సంస్కృత మూలం ఉన్న పదాలు ఉంటాయి. అంబేడ్కర్ ప్రతిపాదించినట్లుగా సంస్కృతం అధికార భాష ఎందుకు కాకూడదని నన్ను నేను ప్రశ్నించుకుంటా’ అని మాజీ సీజేఐ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే అన్నారు. అయితే.. ఈ పరివర్తన రాత్రికి రాత్రే జరగదని, దీనికి ఏళ్లు పడుతుందని చెప్పారు.
‘‘రాజ్యాంగ ఆదేశానుసారం ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల్లో హిందీ, ఇంగ్లీషు భాషలను ఉపయోగిస్తున్నారు. అయితే, స్థానిక భాషల్లో పిటిషన్లు ఇచ్చినా స్వీకరించేందుకు కోర్టులు వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదు. జిల్లా కోర్టుల్లోనూ కొన్ని హైకోర్టుల్లోనూ ప్రాంతీయ భాషలే చలామణి అవుతున్నాయి.’’ అని అన్నారు.
సంస్కృత భాషకు ఏ మతంతోనూ సంబంధం లేదని చెప్పిన జస్టిస్ బోబ్డే.. తత్వశాస్త్రం,సైన్స్, సాహిత్యం, ఆర్కిటెక్చర్, ఖగోళ శాస్త్రం తదితర అంశాలతో ఈ భాషకు సంబంధం ఉందని చెప్పారు. దీనిని అధికారిక భాషగా ప్రకటించడం మతాల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన అభిప్రాయడ్డారు. ‘‘ సంస్కృత భాష ఉత్తర భారతదేశానికో, దక్షిణ భారత దేశానికో చెందింది కాదు. లౌకక సమానత్వానికి గుర్తుగా ఉంటుంది. కంప్యూటర్లకు సైతం ఈ భాష సరిగ్గా సరిపోతుందని నాసా శాస్త్రవేత్త చెప్పినట్లు’’ అని జస్టిస్ బోబ్డే పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Mumbai Indians: జస్ప్రీత్ బుమ్రా స్థానంలో వెటరన్ ప్లేయర్.. ఎవరంటే?
-
Viral-videos News
UP MLA: ‘కాలితో ఇలా తన్నగానే తొలగిపోయిన తారు.. ఇదీ యూపీ రోడ్డు పరిస్థితి!’
-
Movies News
Pooja Hegde: బతుకమ్మ పండగలో భాగమవడం గౌరవంగా భావిస్తున్నా: పూజాహెగ్డే
-
World News
Joe Biden: మా దేశ విలేకరిని వెంటనే విడుదల చేయండి: రష్యాను కోరిన బైడెన్
-
India News
Plant Fungi: మనిషికి సోకిన ‘వృక్ష శీలింధ్రం’.. ప్రపంచంలోనే తొలి కేసు భారత్‌లో!
-
Sports News
GT vs CSK: గుజరాత్ బోణీ.. చెన్నైపై 5 వికెట్ల తేడాతో విజయం